Film Chamber Press Meet : సినిమా షూటింగ్స్ మొదలవుతాయా.. ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్..

నేడు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఫిలిం ఛాంబర్ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్ మీట్ లో ఇప్పటివరకు జరిగిన చర్చలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా షూటింగ్స్ పునః ప్రారంభంపై కూడా.............

film chamber

Film Chamber Press Meet :  టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలకి పరిష్కారం దొరికేదాకా షూటింగ్స్ కూడా నిలిపివేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్.. ఇలా పలు సంఘాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ సమస్యలకి, జనాలని థియేటర్లకు రప్పించడానికి పరిష్కారాలు వెతుకుతున్నాయి. తాజాగా ఈ సమావేశాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.

Viruman Movie Success : విరుమన్‌ సినిమా హిట్ అవ్వడంతో.. హీరో కార్తీ, నిర్మాత సూర్య, డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్టులిచ్చిన డిస్ట్రిబ్యూటర్

నేడు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఫిలిం ఛాంబర్ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్ మీట్ లో ఇప్పటివరకు జరిగిన చర్చలపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా షూటింగ్స్ పునః ప్రారంభంపై కూడా ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇవ్వనుంది. ఈనెల 22 నుంచి షూటింగులు మొదలవుతాయని సమాచారం. షూటింగ్స్ ఆపేశాక అనేక చర్చలు, సమావేశాల అనంతరం ఫిలిం ఛాంబర్ పెడుతున్న ప్రెస్ మీట్ కావడంతో టాలీవుడ్ వర్గాలు ఈ ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.