Viruman Movie Success : విరుమన్ సినిమా హిట్ అవ్వడంతో.. హీరో కార్తీ, నిర్మాత సూర్య, డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్టులిచ్చిన డిస్ట్రిబ్యూటర్
ఈ సక్సెస్ మీట్ లో సినిమా హిట్ అయి డబ్బులు బాగా వచ్చినందుకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ ఈ సినిమా హీరో కార్తీకి, నిర్మాత సూర్యకి, సహా నిర్మాత రాజశేఖర్ పాండియన్‌కు డైమండ్ బ్రాస్‌లేట్స్ గిఫ్ట్..........
Viruman Movie Success : సాధారణంగా సినిమా హిట్ అయితే హీరోలు, నిర్మాతలు డైరెక్టర్స్ కి, ఆ సినిమాకి పనిచేసిన వారికి గిఫ్టులు ఇస్తూ ఉంటారు. కానీ తాజాగా హీరో కార్తీ నటించిన తమిళ సినిమా విరుమన్ హిట్ అవ్వడంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ హీరో కార్తీ, డైరెక్టర్, నిర్మాతలకి గిఫ్టులు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కార్తీ హీరోగా తెరకెక్కిన విరుమన్ సినిమా ఆగస్టు 12న రిలీజ్ అయి తమిళనాడులో మంచి విజయం సాధించింది. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య నిర్మించాడు. ఈ సినిమాని తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ రిలీజ్ చేశాడు. సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లు బాగా వచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ స్పెషల్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Krithi Sanon : నా స్వయంవరంలో ఆ ఇద్దరు హీరోలతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఉండాలి
ఈ సక్సెస్ మీట్ లో సినిమా హిట్ అయి డబ్బులు బాగా వచ్చినందుకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ ఈ సినిమా హీరో కార్తీకి, నిర్మాత సూర్యకి, సహా నిర్మాత రాజశేఖర్ పాండియన్‌కు డైమండ్ బ్రాస్‌లేట్స్ గిఫ్ట్ గా ఇచ్చాడు. తానే స్వయంగా వారి చేతులకి వీటిని తొడిగాడు. అలాగే సినిమా దర్శకుడు ముత్తయ్యకు డైమండ్ రింగ్ ని కానుకగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎప్పుడూ హీరోలు, నిర్మాతలు గిఫ్టులివ్వడం చూసి, తాజాగా డిస్ట్రిబ్యూటర్ హీరోకి, నిర్మాతకి గిఫ్ట్స్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Success is best when shared! ?
To celebrate the victory of #Viruman here’s presenting our #Viruman @karthi_offl, our co producer @rajsekarpandian and our producer @suriya_offl with a Diamond Bracelet and @dir_muthaiya with a Diamond ring!Now, running successfully! ? pic.twitter.com/S6Is8e1B1p
— Sakthivelan B (@sakthivelan_b) August 17, 2022
View this post on Instagram