Krithi Sanon : నా స్వయంవరంలో ఆ ఇద్దరు హీరోలతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఉండాలి
కృతి సనన్ సమాధానమిస్తూ.. ''ఒకవేళ నాకు స్వయంవరం పెడితే ఆ స్వయంవరంలో ముగ్గురు హీరోలు కచ్చితంగా ఉండాలి అనుకుంటాను. హీరో కార్తీక్ ఆర్యన్, ఆదిత్య కపూర్ ఉండాలి. వీళ్ళిద్దరూ చూడటానికి బాగుంటారు. ఇంకో హీరో విజయ్ దేవరకొండ.............

Krithi sanon wants vijay devarakonda in her swayamvaram
Krithi Sanon : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇక విజయ్ కి ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. మామూలు ప్రేక్షకులతో పాటు హీరోయిన్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. చాలా మంది సౌత్, బాలీవుడ్ హీరోయిన్స్ విజయ్ దేవరకొండకి ఫ్యాన్సే. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ విజయ్ తో డేటింగ్ చేయాలని ఉందని, విజయ్ తో కలిసి నటించాలని ఉందని చెప్పారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ భామ చేరింది.
తెలుగులో వన్- నేనొక్కడ్నే సినిమాతో పరిచయమైన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ కి మీకు స్వయంవరం పెడితే అందులో ఏ హీరోలు ఉండాలి అనుకుంటున్నారు అని అడిగారు.
Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..
దీనికి కృతి సనన్ సమాధానమిస్తూ.. ”ఒకవేళ నాకు స్వయంవరం పెడితే ఆ స్వయంవరంలో ముగ్గురు హీరోలు కచ్చితంగా ఉండాలి అనుకుంటాను. హీరో కార్తీక్ ఆర్యన్, ఆదిత్య కపూర్ ఉండాలి. వీళ్ళిద్దరూ చూడటానికి బాగుంటారు. ఇంకో హీరో విజయ్ దేవరకొండ ఉండాలి. విజయ్ దేవరకొండ లుక్స్, స్టైల్, మాట్లాడే విధానం బాగుంటుంది” అని తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్ గర్ల్స్ లిస్ట్ లో కృతి సనన్ కూడా చేరిపోయింది అని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.