Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున నగరంలోని మాదాపూర్ ప్రాంతంలోని నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవటం స్థానిక ప్రజలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది.
- Harishth Thanniru
- Published On : August 1, 2022 / 07:13 AM IST
Hyderabad
Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున నగరంలోని మాదాపూర్ ప్రాంతంలోని నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవటం స్థానిక ప్రజలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని మజీబ్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలిసింది. మరొకరికి గాయాలయ్యాయి. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్ పై వచ్చిన ముజీబ్ మధ్య మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజీబ్ ఆరు రౌండ్ లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మరణించాడు.
Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. డీసీపీ ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముజీబ్, ఇస్మాయిల్ మధ్య ఆస్తి గొడవలే కాల్పులకు దారితీసినట్లు సమాచారం. ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి గొడవల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CWG 2022: భారత్‌కు మూడో స్వర్ణం తెచ్చిన అచింతా షూలి
ఇదిలాఉంటే ఇస్మాయిల్, మజీబ్ లు ఇద్దరు రౌడీషీటర్లు. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడింది. అరే మైసమ్మ టెంపుల్ సమీపంలో మజీబ్ నివాసముంటున్నాడు. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెటిల్మెంట్ ల కోసం ముఠాగా ఏర్పడినట్లు సమాచారం. డబ్బు పంపకంలో ఏర్పడ్డ విబేధాల వల్ల వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
