Parvathipuram District
Parvathipuram District : అకాల వర్షాలకు చాలా చోట్ల కరెంటు స్థంభాలు కూలిపోతున్నాయి. కరెంటు తీగలు తెగి పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం మనుష్యులు, మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తోంది. పార్వతీపురం జిల్లా భామిని మండలం కాట్రగడ్డలో విషాదం సంఘటన జరిగింది. కరెంట్ షాక్ తో 4 ఏనుగులు చనిపోయాయి.
పార్వతీపురం జిల్లాలో కరెంట్ షాక్ తో 4 ఏనుగులు మృతి చెందాయి. ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం కావడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అయితే ఒడిశా నుంచి 6 ఏనుగులు వచ్చాయని అందులో 4 ప్రమాదంలో చనిపోయినట్లు అంటున్నారు. మిగిలిన ఏనుగులు తివ్వాకొండవైపు వెళ్లినట్లు స్ధానికులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఇదే పరిస్థితి కొనసాగితే మరింత ప్రమాదకరమని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.
Elephant attack on woman : ఏనుగుతో పరాచకాలు ఆడితే ఇలాగే ఉంటుంది !
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.