The Elephant Whisperers : ఆస్కార్ అందుకున్న రోజే ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులు మిస్సింగ్.. షాక్ లో చిత్రయునిట్..

95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నిర్మాత గునీత్ మోంగా, డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ లు ఈ అవార్డుని అందుకున్నారు...............

The Elephant Whisperers : ఆస్కార్ అందుకున్న రోజే ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులు మిస్సింగ్.. షాక్ లో చిత్రయునిట్..

The Elephant Whisperers Elephants missing in Forest on Oscar Winning day

The Elephant Whisperers :  95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నిర్మాత గునీత్ మోంగా, డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ లు ఈ అవార్డుని అందుకున్నారు. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసుమళ్ళిన జంట రెండు అనాథ ఏనుగు పిల్లలని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లలతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్లలు చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్లలు, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ ని కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

అయితే ఈ సినిమాలో నటించిన వాళ్ళు నిజంగా అక్కడ ఏనుగు పిల్లలతో పాటు జీవించే వాళ్ళే. అన్ని రియల్ స్టోరీలో ఉండే రియల్ క్యారెక్టర్స్ తో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అయితే ఆస్కార్ అవార్డు అందుకున్న రోజే ఈ డాక్యుమెంటరీలో నటించిన రెండు ఏనుగులు కనపడకుండా పోయాయి. ఈ విషయాన్ని ఏనుగులని సంరక్షిస్తున్న బొమ్మన్ తెలిపాడు.

ఆస్కార్ అవార్డు రావడంతో మీడియా వాళ్ళు బొమ్మన్ దగ్గరకు వెళ్లగా ఈ విషయాన్ని తెలిపాడు. కొంతమంది తాగుబోతులు రావడంతో వాళ్ళని తరుముకుంటూ ఏనుగులు అడివిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం వెతుకుతున్నాం, ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించాం. ఆ రెండు ఏనుగులు కలిసి ఉన్నాయా లేక విడిపోయాయా కూడా తెలీదు అని తెలిపాడు. అవార్డు అందుకున్న రోజే ఈ ఏనుగులు మిస్ అవ్వడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ వార్త వైరల్ గా మారింది.

HotStar : హాట్‌స్టార్ ఆస్కార్ తో కూడా మెప్పించలేకపోయింది.. అసలే తగ్గుతున్న ఆదరణ.. ఇప్పుడేమో ఇలా..

ఇక ఆస్కార్ అవార్డు రావడం గురించి బొమ్మన్ ని అడగగా అతను దాని గురించి మాట్లాడుతూ.. నాకు సినిమా గురించి ఎక్కువగా తెలీదు. దాన్ని ఎలా తీస్తారో అసలు తెలీదు. ఒకరోజు కార్తీకి మేడం వచ్చి సినిమా తీస్తాం మమ్మల్ని, మా ఏనుగులని అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మేము చేశాము. మాకు ఆ అనుభవం కొత్తగా ఉంది. ఈ అవార్డు గురించి చాలా ఆనందంగా ఉంది. మా అటవీ అధికారులు చెప్పారు చాలా పెద్ద అవార్డు వచ్చిందని, కార్తీకి మేడంకు ధన్యవాదాలు అని తెలిపారు.