Tirupati Boy Safe : తిరుపతిలో బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు.

Boy

boy Kidnapped in Tirupati : తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. బాలుడు క్షేమంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు సంతోష పడ్డారు. దీంతో బాలుడిని అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 5న తిరుపతిలోని అలిపిరి బస్టాండ్‌ దగ్గర నాలుగు నెలల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్‌ కోసం గాలింపు చేపట్టారు.

యాచకురాలైన ఆశ బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. మైసూర్‌లో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్‌ ఆశపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.