Four Terrorists killed in Kashmir: కశ్మీరులో చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టిన పోలీసులు..నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు...

Four Terrorists killed in Kashmir

Four Terrorists killed in Kashmir: కశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు.(security forces foil infiltration bid) కుప్వారాలోని మచల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో శుక్రవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు పీఓకే నుంచి భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Titanic submersible destroyed: టైటానిక్ సబ్‌మెర్సిబుల్ పేలుడును రికార్డ్ చేసిన యూఎస్ నేవీ

పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి నలుగురు ఉగ్రవాదులు కుప్వారాలోని మచల్ సెక్టార్ కాలాజంగిల్ మీదుగా వస్తుండగా జమ్మూకశ్మీర్ పోలీసులు కాల్పులు జరిపారని కశ్మీర్ జోన్ పోలీసు ఉన్నతాధికారి ట్వీట్ చేశారు.

Assam Floods:22 జిల్లాలను ముంచెత్తిన వరదలు..5లక్షల మంది తరలింపు

జూన్ 16వతేదీన కూడా కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.ఇటీవల తరచూ పాక్ వైపు నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండటంతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల చొరబాట్లను పోలీసులు అడ్డుకున్నారు.