Assam Floods:22 జిల్లాలను ముంచెత్తిన వరదలు..5లక్షల మంది తరలింపు

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు....

Assam Floods:22 జిల్లాలను ముంచెత్తిన వరదలు..5లక్షల మంది తరలింపు

Assam Floods

Updated On : June 23, 2023 / 9:46 AM IST

Assam Floods: అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు.( 5 Lakh People Affected) టముల్ పూర్ ప్రాంతంలో వరదనీటికి ఒకరు కొట్టుకుపోయారు. నల్బరీ, బాజాలీ, బార్ పేట, లఖింపూర్, బక్సా, టముల్ పూర్, దారంగ్, కొక్రాఝార్ జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి.(Assam Floods)

US lawmakers selfies with PM Modi: మోదీతో సెల్ఫీలు,ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీ పడిన అమెరికా చట్టసభ సభ్యులు

రాష్ట్రవ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 58 రెవెన్యూసర్కిళ్లలోని 1366 గ్రామాలు వరదనీటిలో మునిగాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పలు చోట్ల వంతెనల మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. వరదబాధితులను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల వల్ల పశువులు సైతం అవస్థలు పడుతున్నాయి.

James Cameron : టైటాన్ కథ విషాదాంతం.. కానీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అక్కడికి 33 సార్లు వెళ్ళొచ్చాడు..

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయ పునరావాస పనులు చేపట్టారు. వరదల ధాటి వల్ల 92 రోడ్లు, మూడు వంతెనలు, పలు అంగన్ వాడీ కేంద్రాల భవనాలు, సాగునీటి కాల్వలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.