Viral Video
Viral Video: అప్పుడప్పుడూ జంతువులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా సీ లయన్ చేసిన ఒక పని కూడా నవ్వులు పూయిస్తోంది. ఈక్వెడార్‌లోని గాలాపగొస్ ఐలాండ్స్‌లో ఉన్న ఒక బీచ్‌సైడ్ రిసార్ట్ దగ్గర సముద్రంలోంచి బయటికొచ్చింది ఒక సీ లయన్. నేరుగా రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి ఈదుకుంటూ వెళ్లి, పక్కనే ఉన్న లాంజ్ చైర్‌పైకి ఎక్కి రిలాక్స్‌డ్‌గా పడుకుంది.
Elephant Viral Video: దురదపెట్టిన ఏనుగు ఏం చేసిందో చూడండి: వైరల్ వీడియో
అయితే, అప్పటికే ఆ చైర్‌పై ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సీ లయన్ తన చైర్‌పైకి రావడం గమనించిన ఆ వ్యక్తి వెంటనే లేచి, పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు సీ లయన్ ఆ చైర్‌పై పడుకుని రిలాక్స్ అయింది. అయితే, పక్కనే ఇంకో చైర్ ఉన్నా, ఆ సీ లయన్ అతడి చైర్‌నే ఎంచుకోవడం విశేషం. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.