Elephant Viral Video: దురదపెట్టిన ఏనుగు ఏం చేసిందో చూడండి: వైరల్ వీడియో

అడవిలో తిరుగుతున్న ఏనుగు..ఉన్నట్టుండి ఒక చెట్టును కూల్చివేసింది. భారీ వృక్షాన్ని ఒక్క ఉదుటున పెకిలించి వేసింది ఏనుగు.

Elephant Viral Video: దురదపెట్టిన ఏనుగు ఏం చేసిందో చూడండి: వైరల్ వీడియో

Elephant

Updated On : April 29, 2022 / 5:27 PM IST

Elephant Viral Video: ఏనుగు ఎంత బలంగా ఉంటుందో మనకు తెలుసు. మనకు ఎంతో బరువుగా ఉండే వస్తువు కూడా ఏనుగు ముందు గడ్డి పరకే. అలాగే అడవులను రక్షించడంలోనూ ఏనుగులు పెద్దన్న పాత్ర పోషిస్తుంటాయని పరిశోధకులు చెబుతుంటారు. అడవుల్లో చెట్లను పెకిలించి నీటి ఊటలను కనిపెట్టి ఇతర జంతువులకు నీటి జాడలను వెతికి పెడుతుంటాయి జంతువులు. అయితే ఇక్కడ ఒక ఏనుగు కూడా ఒక పెద్ద చెట్టును పెకిలించింది. అయితే నీటి ఊట కోసం కాదు. వివరాల్లోకి వెళితే..అడవిలో తిరుగుతున్న ఏనుగు..ఉన్నట్టుండి ఒక చెట్టును కూల్చివేసింది. భారీ వృక్షాన్ని ఒక్క ఉదుటున పెకిలించి వేసింది ఏనుగు.

Also read:Sister Andre : ‘రోజూ వైన్ తాగ‌డం వ‌ల్లే 118 ఏళ్లు ఆరోగ్యంతో ఉన్నా’..

ఇదేదో ఏనుగు కోపంతో చేసింది కాదు. కూలిన చెట్టుపై వెనుకగా వెళ్లి కూర్చున్న ఏనుగు దురద పుడుతున్న తన వెనుక భాగాన్ని చెట్టుకు రుద్దుకుంది. ఈ దృశ్యాన్ని అక్కడ జంగిల్ సఫారీలో ఉన్న కొందరు పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ..ఏనుగు దురద వస్తే చెట్టైనా పుల్లలాగా మారిపోతుందని ఒకరంటే..మనకు అందరాని చోట దురదపెట్టినపుడు ఎవరైనా వచ్చి గోకితే ఆ సుఖమే వేరబ్బ..అంటూ కామెంట్ చేస్తున్నారు.