Sister Andre : ‘రోజూ వైన్ తాగ‌డం వ‌ల్లే 118 ఏళ్లుగా ఆరోగ్యంతో ఉన్నా’..

118 ఏళ్ల వయస్సులో జీవించి ఉన్న వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కిన ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ తన ఆరోగ్య రహస్యం ‘Wine’అని చెబుతున్నారు.

Sister Andre : ‘రోజూ వైన్ తాగ‌డం వ‌ల్లే 118 ఏళ్లుగా ఆరోగ్యంతో ఉన్నా’..

118 Years Sister Andre..guinness Records (1)

Sister Andre : 100 ఏళ్లు వచ్చినవారిని మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని అడిగితే ఆహారం అలవాట్లు అని చెబుతారు. లేదా వ్యాయామం చేస్తున్నాం అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం అని చెబుతారు. కానీ 118 ఏళ్ల ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ మాత్రం తన ఆరోగ్య రహస్యం ‘వైన్’అని చెబుతున్నారు. నేనే ప్రతీరోజు వైన్ తాగుతాను అందుకే 118 ఏళ్లు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు సిస్టర్ ఆండ్రే అని పిలిచే లూసిల్ రాండన్.

ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధురాలు జ‌పాన్‌కు చెందిన‌ కేన్ త‌న‌కా (118) ఏప్రిల్ 19,2022న క‌న్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మ‌ర‌ణంతో 118 ఏళ్ల ఫ్రెంచ్ సన్యాసిని ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు. సిస్టర్ ఆండ్రే అని పిలుస్తున్న‌ లూసిల్ రాండన్ ఫిబ్రవరి 11, 1904న జన్మించారు. ఆమె ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు 118 ఏళ్ల‌ు. దీంతో ఆమె 118 ఏళ్ల వయస్సులో జీవించి ఉన్న వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కారు.

Also read : ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించనున్న 118 ఏళ్ల వృద్ధురాలు..రెండు మహమ్మారులను జయించిన యోధులు..

ఈ ఘ‌న‌త సాధించేకంటే ముందు ఆమె అత్యంత పెద్ద‌ వ‌య‌స్సుగ‌ల మూడో ఫ్రెంచ్ వ్యక్తి, మూడో యూరోపియన్ వ్య‌క్తి కూడా కావటం మరో మరో విశేషం అని చెప్పాలి. అంతేకాదు ఎంతోమందిని కబళించిన కోవిడ్ మహమ్మారి సోకినా దాన్ని కూడా ఎదుర్కొని జీవించారు లూసిల్ రాండన్. కొవిడ్‌సోకి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన‌ అత్యంత వ‌య‌స్సుగ‌ల‌ వృద్ధురాలుగా కూడా లూసిల్ పేరొందారు. అత్యంత ఎక్కువ‌కాలం జీవించి ఉన్న సన్యాసినిగా ఆమె రికార్డులు క‌లిగి ఉన్నారు.ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న లూసిల్ రాండన్ తన ఆరోగ్య రహస్యం ‘వైన్’అని చెబుతున్నారు. కానీ వైన్ తాగండీ అని తాను చెప్పను అని కూడా చెబుతున్నారామె.

లూసిల్ సుదీర్ఘ సేవా జీవితంలో ఉపాధ్యాయురాలిగా, గ‌వ‌ర్నెస్‌గా ప‌నిచేశారు. రెండో ప్ర‌పంచ యుద్ధ‌స‌మ‌యంలో పిల్ల‌ల సంర‌క్ష‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. ఆమె విచీ, అవెర్గ్నేరోన్ ఆల్ప్స్ ప్రాంతంలోని ఆస్పత్రిలో 28 ఏళ్లు అనాథలు, వృద్ధులకు సేవలు చేశారు. వారికి సంబంధించిన అన్ని విధాల బాగోగులు చూసుకున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల‌తోపాటు స్పానిష్ ఫ్లూ, కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిల‌ను చూశారు. ఇలా ఆమె చూసిన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు.ఇన్ని ప్రత్యేకతలు కలిగిన లూసిల్ రాండ‌న్‌ సుదీర్ఘ జీవిత రహస్యం ఏమిటి? అని ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. ఆమె జీవన విధానంగురించి తెలుసుకుంటున్నారు. ఆమె ఎటువంటి ఆహారం తీసుకుంటారు? ఎటువంటి ద్రవపదార్ధాలు తీసుకుంటారు? అని సెర్చ్ చేస్తున్నారు. ఆమె గురించి సంర‌క్ష‌కులు కొంత స‌మాచారాన్ని ఇచ్చారు.

Also read : Bird flu : అమెరికాలో బయటపడ్డ తొలి బర్డ్‌ఫ్లూ కేసు

ఆ వివరాల ప్రకారం..రాండ‌న్ ప్ర‌తిరోజూ అల్పాహారం త‌ప్పనిస‌రిగా తీసుకుంటారు. ప్రతీరోజు సమయానికి బ్రేక్‌ఫాస్ట్ తింటారు. ప్ర‌తిరోజూ ఒక గ్లాసు వైన్ తీసుకుంటారు. బ‌హుశా ఆమె ఆరోగ్య ర‌హ‌స్యం ఇదే అయి ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. వైన్ తో పాటు లూసిల్ ప్ర‌తిరోజూ చాక్లెట్స్ త‌ప్ప‌నిస‌రిగా తింటారు. అంతేకాదు ప్రతీరోజు ఉద‌యం ఏడు గంట‌ల‌కే నిద్ర‌లేస్తారు. సమయం ప్రకారం భోజనం చేస్తారు. సుదీర్ఘకాలం సేవ చేయటం వల్ల ఆమె మానసికంగా దృఢత్వం సాధించారని..అదికూడా ఆమె సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి కారణమంటారు. నిపుణులు కూడా అదే చెబతున్నారు.

తన ఆరోగ్యం గురించి..తన సుదీర్ఘాయువు గురించి లూసిల్ రాండన్ మాట్లాడుతూ.. ‘నేను రోజూ వైన్ తాగ‌డం వ‌ల్లే ఇన్నిరోజులు బ‌తికి ఉన్నానేమో నాకు తెలియ‌దు.. అలా అని అంద‌రినీ నేను వైన్ తాగ‌మ‌ని చెప్పను’ అని సిస్ట‌ర్ ఆండ్రీ గా పిలుస్తున్న లూసిల్ రాండన్ చెబుతున్నారు.