ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించనున్న 118 ఏళ్ల వృద్ధురాలు..రెండు మహమ్మారులను జయించిన యోధులు..

ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించనున్న 118 ఏళ్ల వృద్ధురాలు..రెండు మహమ్మారులను జయించిన యోధులు..

japan 118 years old kane tanaka  carry the olympic torch :  జపాన్ కు చెందిన కానె తనాకా రెండు మహమ్మారులను జయించిన యోధురాలు. వయస్సు 118 సంవత్సరాలు. కరోనాతో పాటు క్యాన్సర్ ను కూడా జయించిన ఘతన పొందిన మహిళ. కరోనాతో పాటు రెండు సార్లు క్యాన్సర్ ను కూడా జయించారు కానె తనాకా. ఆమె మరో ఘనతను పొందనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ జ్యోతిని స్వీకరించనున్నారు కానెతనాకా. జపాన్‌లోని షైమ్‌ ప్రాంతంలో నివాసముండే కానె. జీవితంలో ఎన్నో సమస్యల్ని జయించారు. అయినా ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు. అదే ధైర్యం..అదే స్థైర్యంతో జీవిస్తున్న ఆమె త్వరలోనే ఒలింపిక్ జ్యోతిని స్వీకరించనున్నారు.

ప్రపంచాన్ని జయించిన కరోనా మహమ్మారి కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడ్డాయి. దీంతో 2021లో ప్రేక్షకులను అనుమతించకుండా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు జపాన్ సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగానే జపాన్ రాజధాని అయిన టోక్యోలో ఒలింపిక్స్ కమిటీ క్రీడలకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఈ క్రమంలో ప్రస్తుతం బతికి ఉన్న వారిలో అత్యధిక వయసున్న జపాన్‌కు చెందిన కానె తనాకా అనే 118 ఏళ్ల వృద్ధురాలు ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించనున్నారు. కానె తనాకా రెండు సార్లు క్యాన్సర్ ను జయించారు. అలాగే కరోనా బారిన పడి దాన్ని కూడా జయించి యోధురాలిగా నిలబడ్డారు. వయస్సుతో పాటు వచ్చిన సమస్యలు..రెండు మహమ్మారులను జయించిన కానె తనాకా ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితమయ్యారు.

ఈ సంవత్సరం మే లో ఒలింపిక్ టార్చ్‌ను స్వీకరించి.. తరువాత రన్నర్‌కు ఇవ్వనున్నారామె. వీల్ చైర్‌కే పరిమితమైనాగానీ ఆమె ఒలింపిక్ జ్యోతి కోసం ఆమె మరోసారి కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇదికూడా ఓ పోరాటమనే చెప్పాలి. గత జనవరిలోనే ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు.

ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించి దాన్ని క్రీడాకారుడికి అందించేందుకు ఆమెకు కుటుంబ సభ్యులు కంఫర్ట్ గా ఉండే బూట్లను పుట్టినరోజు నాడు గిఫ్టుగా ఇచ్చారు. ప్రస్తుతం కానె తనాకా ఓ నర్సింగ్ హోమ్‌లో ఉంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె 18 నెలలు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అలా ఉన్న సమయంలో లెక్కలు చేస్తూ మెదడుకు పని చెప్పేవారామె. అలా తాను డల్ గా లేకుండా ఉత్సాహంగా ఉండేదాన్ని అని ఆమె తెలిపారు.

రెండు మహమ్మారులను జయించిన యోధురాలు విశేషాలు..
తానకా 1903లో జన్మించింది. 19 ఏళ్లకే ఒక రైస్ షాప్ యజమానిని వివాహం చేసుకున్నారు. నలుగురు పిల్లలు. ఐదుగురు మనవళ్లు, ఎనిమిది మంది మునిమనవళ్లు కూడా ఉన్నారు. 103 ఏళ్లు వచ్చే వరకు షాపులో పనిచేస్తునే ఉండేవారు. అంతేకాదు ఆమె రెండు ప్రపంచ యుద్ధాల్ని చూశారు. 1918 స్పానిష్ ఫ్లూ విపత్తులను కూడా చూశారామె. అలా ఎన్నో విపత్తులను చూశారు.

ఆ విషయంలో కూడా కానె రికార్డు
గతంలో 2016 రియో ఒలింపిక్స్ సందర్భంగా బ్రెజిల్‌కు చెందిన ఐదా జెమానెక్ అనే 106 ఏళ్ల వ్యక్తి ఒలింపిక్స్ జ్యోతిని స్వీకరించారు. 2014 సోచి వింటర్ గేమ్స్ కోసం 101 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అలెగ్జాండర్ కప్టారెన్కో ఒలింపిక్స్ టార్చ్‌తో పరుగెత్తారు. వీరి రికార్డులను తనకా అధిగమించనున్నారు. 1964లో టోక్యోలో చివరిసారిగా ఒలింపిక్స్ జరిగినప్పుడు తానాకా వయసు 61 ఏళ్లు. ఈ గేమ్స్.. ఆమె పుట్టిన తరువాత జరుగుతున్న 49వ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్ గేమ్స్ కలిపి) అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

జపాన్ లో తగ్గుతున్న జననాలు..పెరుగుతున్న వృద్ధుల జనాభా
జపాన్‌లో జననాలు తగ్గిపోయాయి. దీంతో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటోంది. ఇలా వృద్ధుల సంఖ్య పెరగటంతో ఆనాటిదికాదు గత 50 ఏళ్ల నుంచి జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుతూనే ఉంది.ని గత జనాభా లెక్కలు తెలిపాయి. గత జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే..వందేళ్లు దాటిన వారి సంఖ్య 80,000 కంటే ఎక్కువగా ఉందట. 2020 జనాభా లెక్కల ప్రకారం..జపాన్‌లో ప్రతి 1,565 మందిలో ఒకరికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంది. వీరిలో 88 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. జపాన్‌లో మగవాళ్ల జీవితకాలం సగటున 81.4 సంవత్సరాలుగా ఉండగా..అదే మహిళల జీవితకాలం 87.45 సంవత్సరాలుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

ఆమె పేరుతో రికార్డు
2019లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తనాకాను ప్రపంచంలో జీవించి ఉన్న వ్యక్తిగా ధ్రువీకరించింది. ఈ క్రమంలో జపాన్ లో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడాజ్యోతితో మరో రికార్డును ఆమె తన ఖాతాలో వేసుకోనున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా ఫ్రాన్స్‌కు చెందిన మహిళ 122 సంవత్సరాలు జీవించి రికార్డు సాధించింది. కానె తానాకా ఈ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం చక్కటి ఆరోగ్యంగానే ఉన్నారు.

ఒలింపిక్ టార్చ్ రిలే ప్రారంభం..
2020 టోక్యో ఒలింపిక్ టార్చ్ రిలే మార్చి 25న ఫుకుషిమా ప్రిఫెక్చర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఒలింపిక్ జ్యోతి 2011లో సంభవించిన టోహోకు భూకంపం, సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 10 సంవత్సరాల క్రితం జరిగిన విపత్తును గుర్తుచేసుకేనేలా రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఆ తరువాత జపాన్‌లోని ప్రతి ప్రాంతానికి ఒలింపిక్ జ్యోతిని తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఒలింపిక్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.