Bird flu : అమెరికాలో బయటపడ్డ తొలి బర్డ్‌ఫ్లూ కేసు

అమెరికాలో  హెచ్‌5 తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ  దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది.  ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ  పరీక్షలో ఆ వ్యక్తికి   పాజిటివ్ గా తేలింది.

Bird flu : అమెరికాలో బయటపడ్డ తొలి బర్డ్‌ఫ్లూ కేసు

Us Bird Flu

Bird flu :  అమెరికాలో  హెచ్‌5 తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ  దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది.  ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ  పరీక్షలో ఆ వ్యక్తికి   పాజిటివ్ గా తేలింది. వ్యాధి సోకిన వ్యక్తి   కోళ్ల  పరిశ్రమలో పని చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడే అతనికి బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

కొన్ని రోజుల నుంచి అలసటగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.  ప్రస్తుతం అతను వైద్యుల   పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.  గతేడాది అమెరికా పౌల్ట్రీ కేంద్రాల్లో హెచ్5 ఎన్1 వ్యాధి సోకింది.  అయితే వ్యాధి లక్షణాలను మానిటర్ చేస్తున్నట్లు సీడీసీ తెలిపింది.

హెచ్‌5ఎన్‌1 మ‌నుషుల‌కు సోక‌డం ఇది రెండ‌వ కేసు అని, తొలి కేసు బ్రిట‌న్‌లో 2021 డిసెంబ‌ర్‌లో న‌మోదు అయిన‌ట్లు అధికారులు తెలిపారు. సీడీసీ ప్రకారం ఈరోజు వరకు హెచ్5ఎన్1 వైరస్ లు 29 రాష్ట్రాల్లోని పెరటి పక్షుల్లో, 34 రాష్ట్రాల్లోని అడవి పక్షుల్లో కనుగొన్నారు. దీంతో 2,500 మంది లో పరీక్షలునిర్వహించగా ఒక వ్యక్తిలో ఈవైరస్ బయటపడింది.

Also Read : Summer : ఎండలో బారాత్ కోసం కదిలే పెళ్లి పందిరి