అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..! 

  • Publish Date - May 18, 2020 / 01:32 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదిపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను తనదైనశైలిలో గంభీర్ ఖండించాడు. పాకిస్థాన్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉందని 16 ఏళ్ల వృద్ధుడు (అఫ్రిది)  @SAfridiOfficial అన్నాడు. 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉంది. పాక్ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిది, ఇమ్రాన్, బజ్వా వంటి జోకర్లు.. భారతదేశం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విషం చిమ్మగలరు. కానీ కశ్మీరును ఎప్పటికీ దక్కించుకోలేరు. బంగ్లాదేశ్ గుర్తుందా? అని గంభీర్ గట్టిగా బదులిచ్చాడు. ప్రపంచం ఒక ప్రాణాంతక వ్యాధి ప్రభావానికి గురైందన్నారు.  

అంతకంటే ప్రమాదకరమైనది మోడీ మనసులో ఉంది అంటూ అంతకుముందు పీఓకేలో అఫ్రిది నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. తమ సైన్యానికి కశ్మీర్ ప్రజలు మద్దతిస్తున్నారంటూ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ కూడా తప్పుపట్టారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వీడియో మెసేజ్ ద్వారా తన స్వచ్ఛంద సంస్థకు సపోర్టు చేయాలని నన్ను, యువీని అఫ్రిది కోరినట్టు చెప్పాడు. మళ్లీ మళ్లీ అతడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అఫ్రిదిని స్నేహితుడని పిలిచినందుకు బాధపడుతున్నాని, అతడికి మిత్రుడనే అర్హత లేదు అని భజ్జీ తెలిపాడు. 

Read Here>> ఆ దేశంలో టీమిండియా మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు రారు: రోహిత్ శర్మ

ట్రెండింగ్ వార్తలు