ఆ దేశంలో టీమిండియా మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు రారు: రోహిత్ శర్మ

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 09:33 AM IST
ఆ దేశంలో టీమిండియా మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు రారు: రోహిత్ శర్మ

ప్రపంచంలోనే నెం.1 ర్యాంకు రేసులో దూసుకుపోతున్న టీమిండియాకు అమితమైన ప్రజాదరణ అని అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాదు విదేశాల్లో ఆడినా అదే స్థాయిలో అభిమానుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంటుంది. విదేశీ పర్యటనల్లోనూ గంటల కొద్దీ అభిమానులు స్టేడియంలో కూర్చొని ప్లేయర్లలో జోష్ నింపుతుంటారు. 

ఇంగ్లండ్ లోని లార్డ్స్, ఆస్ట్రేలియాలోని మెల్‌బౌర్న్ అదెక్కడైనా సరే ఫ్యాన్స్ కు కొదవేం ఉండదు. అలాంటిది పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బయటపెట్టిన నిజం నమ్మశక్యం కావడం లేదు. లాక్‌డౌన్ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న రోహిత్ శర్మ.. ఇన్‌స్టాగ్రామ్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్‌తో లైవ్‌లో మాట్లాడాడు. 

ఫ్యాన్స్ సపోర్ట్ చేయకుండా టీమిండియా ఆడటం చాలా కష్టం. అలాంటిది బంగ్లాదేశ్‌లో భారత్‌కు గుంపు నుంచి సపోర్ట్ రాదని తేల్చాడు. ఇండియా, బంగ్లాదేశ్ లలో అభిమానులు క్రికెట్ గురించి ఎంతో ఉత్సుకతతో ఉంటారు. ఏదైనా తప్పులు చేస్తే జట్లను విమర్శిస్తారు. పొరుగుదేశాల నుంచి కూడా ఇవి తప్పవు. 

ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంతో ఉంటారో తెలుసు. మేం ఆడడానికి వెళ్తే పరిస్థితి నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది. అని చెప్పుకొచ్చాడు.