Ghani 3 Days Worldwide Collections
Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించి తాజా చిత్రం ‘గని’ గత శుక్రవారం బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ రోజున డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే వీకెండ్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అందరూ ఆశించారు. కానీ శ్రీరామనవమి పండగ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు.
Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఈ ప్రభావం గని చిత్ర కలెక్షన్లపై పడింది. తొలిరోజు ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చినా, శని ఆదివారాల్లో మాత్రం వసూళ్లు తగ్గుముఖం పడ్డాయి. దీంతో ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.4.18 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది. అయితే ఓ మీడియం రేంజ్ హీరోకు ఈ కలెక్షన్లు చాలా తక్కువనే చెప్పాలి. గని కంటెంట్ పరంగా బాగున్నా, సినిమాకు డివైడ్ టాక్ రావడం, రెండో శనివారం, శ్రీరామనవమి సెలవులు వరుసగా రావడంతో జనం ఊళ్లకు వెళ్లారు. దీంతో గని థియేటర్లు జనం లేక ఖాళీగానే కనిపించాయి.
Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.25 కోట్లకుపైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు తొలి మూడు రోజుల వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాతో బయ్యర్లకు నష్టాలు తప్పవా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ వారంలో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో గని చిత్రానికి మరింత ఎఫెక్ట్ తప్పేలా లేదు. మరి ఆలోగా ఈ సినిమా పుంజుకుని కలెక్షన్లు రాబడితేనే బయ్యర్లు సేఫ్ అంటున్నారు సినీ క్రిటిక్స్. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన గని చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
కాగా గని చిత్రం తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – రూ.1.38 కోట్లు
సీడెడ్ – రూ.43 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ.58 లక్షలు
ఈస్ట్ – రూ.31 లక్షలు
వెస్ట్ – రూ.21 లక్షలు
గుంటూరు – రూ.27 లక్షలు
కృష్ణా – రూ.27 లక్షలు
నెల్లూరు – రూ.18 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.3.63 కోట్లు(షేర్) (రూ.6.40 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – రూ.0.24 కోట్లు
ఓవర్సీస్ – రూ.0.31 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.4.18 కోట్లు (షేర్) (రూ.7.50 కోట్లు గ్రాస్)