Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబి, సిద్దు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా..

Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Ghani

Ghani: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబి, సిద్దు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చింది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించింది. న‌దియా, ఉపేంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, సునీల్ శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Ghani: షాకింగ్.. ఇంకా రిలీజ్ కాని ‘గని’.. ఎక్కడంటే?

భారీ అంచనాల మధ్య విడుద‌లైన ఈ సినిమా తొలి రోజు నుంచి డీసెంట్ టాక్‌ తో నడుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వారే కొనుగోలు చేశారు. సినిమా నిర్మాతలు, ఆహా సంస్థ ఇద్దరూ అల్లు కాంపౌండ్ వారే కావడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆహా వద్దకు చేరాయి. కాగా సినిమాను ఏప్రిల్ నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Ghani : గని ప్రీ రిలీజ్ బిజినెస్..

ఏప్రిల్ 8న గని సినిమా విడుదల కాగా అదే ఏప్రిల్ నెలలోనే ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం గని సినిమాను ఏప్రిల్ 29న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వినిపిస్తుంది. దీనిపై ఇప్పటివరకు అటు నిర్మాతల నుండి కానీ.. ఓటీటీ ఆహా నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోగా.. త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు.