Ghani: షాకింగ్.. ఇంకా రిలీజ్ కాని ‘గని’.. ఎక్కడంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుండి మంచి.....

Ghani: షాకింగ్.. ఇంకా రిలీజ్ కాని ‘గని’.. ఎక్కడంటే?

Ghani Movie Kannada Version Not Released

Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుండి మంచి టాక్ వస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ సినిమాకు ఆదరణ మరింత పెరుగుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.

Ghani : గని ప్రీ రిలీజ్ బిజినెస్..

అయితే ఏప్రిల్ 8న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ వారు చెప్పినట్లుగా ఈ సినిమా కన్నడ భాషలో రిలీజ్ కాకపోవడంతో కన్నడ ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఈ సినిమాను కన్నడ వర్షన్‌లోనూ ఇవాళ రిలీజ్ చేయాల్సి ఉండగా, అక్కడ ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. కన్నడ వర్షన్‌లో ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చే బాధ్యతలను నటుడు ఉపేంద్రపై పెట్టారు చిత్ర యూనిట్. కానీ ఎందుకనో ఈ సినిమాను అక్కడ నేడు రిలీజ్ చేయలేదు.

Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

దీంతో ఈ సినిమా కన్నడ వర్షన్ రిలీజ్ కాకపోవడానికి సంబంధించి గని చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిగతా భాషల్లో గని సినిమాను రిలీజ్ చేసి, కన్నడలో మాత్రం ఎందుకని రిలీజ్ చేయలేదా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాను కన్నడలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.