Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

ఇటీవల అన్ని సినిమాలకి తెలంగాణలో రేట్లు పెంచుతున్నారు. 'ఆర్ఆర్ఆర్'కి అయితే మరీ ఎక్కువ రేట్లు పెంచారు. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఈ రేట్లని వ్యతిరేకించారు. సినిమా టీమ్స్........

Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

Ghani

Ghani :  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సయి మంజ్రేకర్ హీరోయిన్ గా `గని` సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి గని సినిమాని తెరకెక్కించగా నిర్మాతలు సిద్ధూ, అల్లు బాబీ నిర్మించారు. `గని`లో వరుణ్ బాక్సర్ గా నటించడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, తమన్నా ఐటెంసాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ సినిమాని 35 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఇటీవల అన్ని సినిమాలకి తెలంగాణలో రేట్లు పెంచుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’కి అయితే మరీ ఎక్కువ రేట్లు పెంచారు. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఈ రేట్లని వ్యతిరేకించారు. సినిమా టీమ్స్ కూడా కలెక్షన్స్ త్వరగా రావాలని రేట్లు పెంచడానికి అనుమతి కోరుతున్నాయి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం దీనికి ఓకే చెప్తుంది. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకి భారీగా టికెట్ రేట్లు పెంచారు తెలంగాణలో.

Piyush Goyal : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై సెంట్రల్ మినిస్టర్ పొగడ్తలు.. రిప్లై ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీం

అయితే ఇప్పుడు ‘గని’ సినిమాకి కూడా పెంచుతారా అనే సందేహం చాలా మందికి ఉంది. ఏపీలో కేవలం 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకి మాత్రమే రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తాము అని తెలిపారు కాబట్టి ఏపీలో గని సినిమాకి టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదు. అయితే తెలంగాణలో మాత్రం సినిమా టీం అడిగితే టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉంది. కానీ సినిమా టీం ఇప్పటివరకు అయితే టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరలేదు. దీంతో తెలంగాణలో గని సినిమాకి పాత రేట్లే ఉంటాయని తెలుస్తుంది.

Rakul Preet Singh : రకుల్‌కి తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?

పాత రేట్ల ప్రకారం అయితే మల్టీప్లెక్స్ లో 250, 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కి ఈ రేట్లు సరిపోతాయి, వీటిని పెంచాల్సిన అవసరం లేదు అని అటు ప్రేక్షకులు, సినిమా యూనిట్ కూడా అభిప్రాయపడుతున్నారు. గని సినిమాకి టికెట్ రేట్ల పెంపు లేకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి.