Piyush Goyal : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై సెంట్రల్ మినిస్టర్ పొగడ్తలు.. రిప్లై ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఇటీవల పీయూష్ గోయల్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమానే నడుస్తుంది దేశమంతా. ఇది చాలా పెద్ద సినిమా, ఇప్పటికే 750 కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డులని.....

Piyush Goyal : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై సెంట్రల్ మినిస్టర్ పొగడ్తలు.. రిప్లై ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీం

Piyush

 

RRR :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ అయి పది రోజులు కావొస్తున్నా ఇంకా చాలా చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ కనిపిస్తుంది. ఈ చిత్ర యూనిట్ కూడా వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇక కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి ఈ సినిమాకి. ఇప్పటికే 750 కోట్లకి పైగా కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. ఈ సినిమాని అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు అభినందిస్తున్నారు. తాజాగా సెంట్రల్ మినిష్టర్ పీయూష్ గోయల్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అభినందిస్తూ మాట్లాడారు.

ఇటీవల పీయూష్ గోయల్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడుస్తుంది దేశమంతా. ఇది చాలా పెద్ద సినిమా, ఇప్పటికే 750 కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డులని సృష్టిస్తుందని విన్నాను. ‘ఆర్ఆర్ఆర్’ లాగే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రికార్డులని బద్దలు కొట్టే బిజీలో ఉంది” అని అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rakul Preet Singh : రకుల్‌కి తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?

ఈ వీడియోని ‘ఆర్ఆర్ఆర్’టీం షేర్ చేసి.. ” మీ మంచి మాటలకు ధన్యవాదాలు పీయూష్ గోయల్ జీ. సినిమాలు అనేవి ఒక దేశం యొక్క సాఫ్ట్ పవర్. భారతదేశ వృద్ధిలో చిన్న భాగం అయినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారతీయ చిత్రాలు పాత్ బ్రేకింగ్ రికార్డులు సృష్టిస్తాయని ఆశిస్తున్నాము” అంటూ పోస్ట్ చేశారు.