Gold Sales : దీపావళికి 50 టన్నుల బంగారం కొన్నారు

భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఉన్న మక్కువ గురించి వేరే చెప్పక్కర్లేదు. సామాన్య మధ్యతరగతి జీవులు కూడా పండుగలకు పబ్బాలకు బంగారం కొంటూంటారు.

Gold Sales :  భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఉన్న మక్కువ గురించి వేరే చెప్పక్కర్లేదు. సామాన్య మధ్యతరగతి జీవులు కూడా పండుగలకు పబ్బాలకు బంగారం కొంటూంటారు. అలాగే మదుపరులు కూడా బంగారంలో పెట్టుబుడులు పెడుతూ ఉంటారు. గతనెలలో బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరిచారు.

దీంతో రూ.303 కోట్ల పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్‌ నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్ట్‌ నెలలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.24 కోట్లుగానే ఉన్నాయని.. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ విడుదలచేసిన లెక్కలు చెపుతున్నాయి. దసరా ,దీపావళి పండుగల సీజన్‌ రావటంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ కొనసాగినట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతిగుప్తా తెలిపారు.

ఈ ఏడాది దంతేరస్‌ సందర్భంగా 50 టన్నుల బంగారం విక్రయమైందని.. 2019తో పోలిస్తే 20 టన్నులు ఎక్కువని మార్కెట్ వర్గాలు పేర్కోన్నాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కాస్తంత పెట్టుబడులు తగ్గడానికి.. భౌతిక బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఉండొచ్చని మార్నింగ్‌స్టార్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు.

Also Read : Swarnamukhi River Flood Water : ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది

అలాగే, బంగారం ధరలు పెరగడం కూడా ఒక కారణమై ఉండి ఉండవచ్చన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌లో వచ్చిన నికర పెట్టుబడుల పరిమాణాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఇప్పటికీ బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అక్టోబర్‌ చివరికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోల (పెట్టుబడి ఖాతా) సంఖ్య 8 శాతం పెరిగి 26.6 లక్షలకు చేరిందని ఆయన వివరించారు.

ట్రెండింగ్ వార్తలు