Swarnamukhi River Flood Water : ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది.

Swarnamukhi River Flood Water : ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది

New Project

Swarnamukhi River Flood Water : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద చేరడంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 15000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల ప్రభావంతో బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి బ్రిడ్జి పై 5 అడుగులు పైన నీరు ప్రవహించటంతో వాలమేడు. పుచ్చలపల్లి. జెమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం,అందలమల గ్రామాలకు రాకపోకలు అధికారులు నిలిపివేశారు.

Also Read : చెన్నైని వదలని వరుణుడు..!_ Heavy Rainfall Causes Waterlogging in Chennai Colonies

స్వర్ణముఖి బ్యారేజ్ దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే పులికాట్ సరస్సు పొంగడంతో పంబలి. పులేంజరీపాలెం. శ్రీనివాసపురం. వాయట కుప్పం. గ్రామాలకు పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆగ్రామాల ప్రజలు పడవ ప్రయాణం పై రాకపోకలు సాగిస్తున్నారు.

మరో వైపు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని శ్రీకాళహస్తి-పాపా నాయుడుపేట     ప్రధాన రహాదారిపై కాజ్‌వే దాటుతూ.. వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు.    గోవిందవరం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్‌వేపై  వరద  నీరు  ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో చెల్లూరు గ్రామానికి చెందిన శంకరయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ, కుమారుడు   కాజ్ వే    దాటుతుండగా.. వరద నీటిలో చిక్కుకున్నారు.   స్థానికులు గుర్తించి పరిగెత్తుకెళ్లి   వారు ముగ్గురిని  గట్టుకు తీసుకువస్తుండగా.. నీటి  ప్రవాహానికి  మరోసారి అదుపుతప్పి   కొద్ది దూరం నీటిలో కొట్టుకుపోయారు.  దీంతో మరింత అప్రమత్తమై.. స్ధానికులు  ముగ్గురినీ సురక్షితంగా కాపాడి   బయటకు తీసుకు  వచ్చారు.