Vaccinated in Marriage Halls : పెళ్లి మండపంలో ఆరోగ్య కార్యకర్తలు..అతిధులకు కరోనా వ్యాక్సినేషన్‌

చుట్టాలు, స్నేహితులతో సందడిగా ఉన్న ఓ పెళ్లి మండపంలోకి ఆరోగ్య కార్యకర్తలు వచ్చారు. అంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదాని కనుక్కుని మరీ వేయించుకోనివారికి టీకాలు వేశారు.

Health workers vaccinated in marriage halls : అక్కడ పెళ్లి జరుగుతోంది. వధూవరుల బంధువులు, స్నేహితులు, శ్రీయేభిలాషులు వచ్చారు. కుర్చీల్లో ఆసీనులై మాటల్లో పడ్డారు. క్షేమ సచారారాలు కనుక్కుంటున్నారు. సరదా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో పెళ్లి మండపంలోకి ఆరోగ్య కార్యర్తలు వచ్చారు. వారి కిట్లుతో సహా వచ్చారు. అది చూసిన పెళ్లి అతిథుతు ఆశ్చర్యపోయారు. ఎవరికి ఏమైంది? మెడికల్ టీమ్ వచ్చారేంటీ? అని ఆందోళన పడ్డారు. కానీ అసలు విషయం తెలిసి..ఆశ్చర్యపోయారు. ఏంటీ పెళ్లికి వస్తే కరోనా ఇంజెక్షన్లు వేస్తారా? అని ఒకరి మొహాలు మరొకకు చూసుకుని..‘ఇదే మని కరోనా రోజులు’అంటూ నవ్వేసుకున్నారు. ఇంతకీ ఇటువంటి ఆసక్తికర ఘటన ఎక్కడ జరిగిందంటే..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో (AMC) జరిగింది.

Read more : వ్యాక్సిన్ పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్

పెళ్లి వేడుకకు వచ్చినవారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా?లేదా? అని అడుగుతున్నారు ఆరోగ్యకార్యకర్తలు. ఎవరెవరు వ్యాక్సిన్‌ తీసుకున్నారు? అంటూ చెక్‌ చేసుకున్నారు. రెండు డోసులు తీసుకోనివారిని, అసలు వ్యాక్సినే తీసుకోనివారిని గుర్తించారు. వెంటనే వారికి టీకా ఇచ్చారు. పెళ్లి మండపంలో కరోనా వ్యాక్సిన్లు వేసే వినూత్న యత్నం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టగా ఇలా వింత ఘటన జరిగింది.

Read more : Abortion Leaves : మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు..

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వివాహ వేడుకలు జరుగుతున్న కమ్యూనిటీ హళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు ఆరోగ్య కార్యకర్తల బృందాలు వెళ్తున్నారు. పెళ్లికి వచ్చినవారు వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్లు, రెండు టీకాలు తీసుకోనివారిని గుర్తించి వారికి టీకాలు వేస్తున్నారని..ఏఎంసీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంట్లో బాగంగా గురువారం (డిసెంబర్ 9,2021) మొత్తం 121 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపారు. వీరిలో అస్సలు ఇప్పటివరకు ఒక్క డోసు కూడా వేసుకోనివారు కూడా ఉన్నారని చెప్పారు. అటువంటివారికి వ్యాక్సిన్ వేయించామని తెలిపారు. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఈ ఏడాది జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 79,96,297 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు