Gujarat Poll : ఒకేఒక్క ‘ఓటరు’ 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం

ఒకేఒక్క ‘ఓటరు’ కోసం 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. గుజరాత్ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ఒకే ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రం.

Gujarat Poll 2022 : ఒకేఒక్క ‘ఓటరు’ కోసం 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. ఓటు వేసేది ఒక్కరే అదో పెద్ద విషయమా?వదిలేయొచ్చు కదా అనుకోవచ్చు..కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఒక్క ఓటుతో ఫలితం తారుమారైన ఎన్నికలు చాలానే ఉన్నాయి. ఒకే ఒక్క ఓటు గెలుపు ఓటములను శాసిస్తుంది. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు కీలకమే.అందుకే గుజరాత్ లో త్వరలో జరుగనున్న పోలింగ్ కోసం ఓ ప్రాంతంలో ఎన్నికల సంఘం ఒకే ఒక్క ఓటరు కోసం ఎనిమిదిమంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది…ఆ ఒకే ఒక్క ఓటరు కోసం 8 మంది అధికారులు, సిబ్బందిని మారుమూల ప్రాంతానికి పంపుతోంది..!!

Gujarat Poll 2022 : గుజరాత్ ఎన్నికలపైనే దేశమంతా ఫోకస్ .. కారణాలు ఇవే..

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌లో ఈ ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ప్రత్యేకత కలిగి ఉన్న నియోజకవర్గం ‘ఉనా’. ఆ ఒకే ఒక్క ఓటరు పేరు ‘‘మహంత్‌ హరిదాస్‌ బాపు’. బనేజ్‌ ప్రాంతానికి చెందిన బాపు తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ ఆ పోలింగ్‌ కేంద్రానికి వచ్చేవారు. ఆ ప్రాంత శివాలయం వద్ద నివసించేది ఆయన ఒక్కరే కావడంతో తన కోసమని ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. కానీ  2019లో మహంత్‌ హరిదాస్‌ మరణించారు.  ఆయన మరణం తరువాత ఆ పోలింగ్‌ బూత్‌ను మూసివేయాలనుకున్నారు.  కానీ ఈ  ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటును కొనసాగిస్తోంది ఈసీ. ఎందుకంటే మహంత్ హరిదాస్ బాపు మరణించిన ఆయన వారసుడిగా మహంత్‌ హరిదాస్‌ మహరాజ్‌ రావడంతో తిరిగి ఆ పోలింగ్‌ బూత్‌ను కొనసాగిస్తున్నారు. త్వరలో జరుగనున్న గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు ఈ పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా వార్తల్లో నిలుస్తోంది. కాగా ఈసీ ఈ పోలింగ్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఆ ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 100కిలోమీటర్ల కంటే ఎక్కవు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

Gujarat Poll 2022 : 27 ఏళ్లలో తొలిసారి త్రిముఖపోరు .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా?

ఆస్తి పాస్తులకే కాదు పోలింగ్ కేంద్రానికి కూడా వారసులు ఉంటారని మహంత్‌ హరిదాస్‌ మరణించిన అదే పోలింగ్ కేంద్రానికి వస్తున్న ఆయన వారసుడిగా మహంత్‌ హరిదాస్‌ మహరాజ్‌ నిరూపించారు. తన ఒక్కరి కోసమే ఈసీ ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం పట్ల హరిదాస్ మహరాజ్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

కాగా ఏ పౌరుడు కూడా తన ఓటు హక్కు వినియోగించటానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. అందుకే ఈ ఒకే ఒక్క ఓటరు కోసం ఈసీ ప్రత్యేకంగా ఎనిమిదిమంది సిబ్బందితో ఈ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తోంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు