Gujarat Poll 2022 : గుజరాత్ ఎన్నికలపైనే దేశమంతా ఫోకస్ .. కారణాలు ఇవే..

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు. కానీ.. గుజరాత్ విషయానికొస్తే అలా కాదు. దేశం మొత్తం ఫోకస్ ఆ స్టేట్ మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సంబంధించిన రాజకీయమంతా.. గుజరాత్ సెంట్రిక్‌గానే నడుస్తుంది. ఆ పార్టీలో ఉన్న టాప్ లీడర్స్ అంతా... అక్కడి నుంచి వచ్చిన వాళ్లే. అందుకే.. అక్కడ ఎలక్షన్ అంటే ఈ రేంజ్ ఇంట్రస్ట్. అలాంటి.. గుజరాత్‌ ఎన్నికల్లో ఈసారి కనిపిస్తున్న కీలకమైన ఫ్యాక్టర్స్ ఏంటి? గుజరాత్ బాద్‌షాని డిసైడ్ చేయబోయే నెంబర్స్ ఏంటి?

Gujarat Poll 2022 : గుజరాత్ ఎన్నికలపైనే దేశమంతా ఫోకస్ .. కారణాలు ఇవే..

Gujarat Poll 2022

Gujarat Poll 2022 : దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. భారత ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ.. గుజరాత్ విషయానికొస్తే అలా కాదు. దేశం మొత్తం ఫోకస్ ఆ స్టేట్ మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సంబంధించిన రాజకీయమంతా.. గుజరాత్ సెంట్రిక్‌గానే నడుస్తుంది. ఆ పార్టీలో ఉన్న టాప్ లీడర్స్ అంతా… అక్కడి నుంచి వచ్చిన వాళ్లే. అందుకే.. అక్కడ ఎలక్షన్ అంటే ఈ రేంజ్ ఇంట్రస్ట్. అలాంటి.. గుజరాత్‌ ఎన్నికల్లో ఈసారి కనిపిస్తున్న కీలకమైన ఫ్యాక్టర్స్ ఏంటి? గుజరాత్ బాద్‌షాని డిసైడ్ చేయబోయే నెంబర్స్ ఏంటి?

గుజరాత్ ఫ్యూచర్‌ని.. అక్కడ పోటీకి దిగుతున్న పొలిటికల్ పార్టీల భవిష్యత్‌ని డిసైడ్ చేయబోయే నెంబర్స్ ఇవే. ఏ స్టేట్‌లో అయినా.. ఎన్నికలు కామన్. దేశంలో.. చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయ్. కానీ.. దేశ ప్రజలంతా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. గుజరాత్ అలా కాదు. ఎందుకంటే.. అది భారత ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం. ఒకప్పుడు.. ఆయన సీఎంగా పనిచేసిన స్టేట్. పైగా.. ఇప్పుడు నేషనల్ బీజేపీకి క్యాపిటల్ లాంటి ప్లేస్. అందుకే.. గుజరాత్ పోల్స్ అంటే ఇంత ఇంట్రస్ట్.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. కొన్ని కీలకమైన పోల్ అంశాలున్నాయ్. ఇప్పుడు.. వాటి మీదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా.. 27 ఏళ్ల బీజేపీ పాలనపై రాష్ట్రంలో పెరుగుతున్న వ్యతిరేకత.. ఎన్నికల్లో కీలకంగా మారనుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే.. బీజేపీ గవర్నమెంట్‌పై ఉన్న అసంతృప్తి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలన్నీ ఏళ్లుగా పరిష్కారం కావడం లేదనే ఫీలింగ్‌లో ఉన్నారు అక్కడి ప్రజలు. ఇక.. మౌలిక వసతులు కూడా కీలకంగా మారనున్నాయ్. గుజరాత్‌ అంటే ఒకప్పుడు మంచి రోడ్లకు బాగా ఫేమస్. కానీ.. గడిచిన ఐదారేళ్లలో స్టేట్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్లు మంచి రోడ్లను నిర్మించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. పైగా.. పాత రోడ్లకు మరమ్మత్తులు చేయకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా గుంతలమయమైన రోడ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయ్.

గుజరాత్‌లో ఉన్న అధిక కరెంటు చార్జీలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయ్. ఎందుకంటే.. దేశంలోనే గుజరాత్‌లో అత్యధికంగా కరెంటు బిల్లులున్నాయ్. అక్కడి పారిశ్రామిక వర్గాలు యూనిట్‌కు ఏడున్నర రూపాయలు చెల్లిస్తున్నాయ్. తెలంగాణ, మహారాష్ట్ర మాదిరిగా.. యూనిట్‌ ఛార్జ్‌ని 4 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ నెలకు 3 వందల యూనిట్ల కరెంటును.. ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఈ హమీనే.. గుజరాత్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో రేప్‌ కేసులో.. 11 మంది దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కీలకంగా మారింది. దోషులు సత్ర్పవర్తనతో మెలగడం వల్లే.. వారిని విడుదల చేస్తున్నామని బీజేపీ సర్కార్ చెప్పడంపై.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Gujarat Poll 2022 : 27 ఏళ్లలో తొలిసారి త్రిముఖపోరు .. గుజరాత్ గడ్డపై కొత్త జెండా ఎగురుతుందా?

గుజరాత్ జనాభాలో 9 శాతంగా ఉన్న ముస్లింలు.. ఈసారి కాంగ్రెస్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. వాళ్లంతా.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం వైపు ఆకర్షితులవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా వ్యూహాత్మకంగా.. మతమరమైన అంశాలైన లవ్ జిహాద్, బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై మౌనంగా ఉన్నారు. ఇటీవలే చోటు చేసుకున్న మోర్బి కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో.. 135 మంది మృతి చెందారు. ఇది .. ఓటర్ల మైండ్ సెట్‌పై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో.. తరచుగా జరుగుతున్న పేపర్ లీక్‌లు, పరీక్షలు వాయిదా పడటం లాంటివి కూడా ఎన్నికలపై ఇంపాక్ట్ చూపనున్నాయి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కసితో.. ఎంతో కష్టపడుతున్న యువతకు.. పేపర్‌లీక్‌లు, ఎగ్జామ్ పోస్ట్‌పోన్‌లు.. తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి. గత నెలలోనే.. డాక్టర్లు, టీచర్లు, హెల్త్ వర్కర్లు, గ్రామస్థాయి అధికారులు ఇలా 20 సంఘాలు తమ డిమాండ్లను బలంగా వినిపిస్తూ.. ఆందోళన బాట పట్టాయి.

ఇక.. గత రెండేళ్లుగా అతివృష్టి కారణంగా పంట నష్టపోయిన రైతులకు.. ఇంకా పరిహారం చెల్లించలేదు. దీంతో.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో.. రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు.. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు చెల్లించిన పరిహారంపైనా.. రైతులు, భూ యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా.. అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం చేపట్టిన భూసేకరణను, వడోదర-ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్-వే కోసం చేస్తున్న భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ట్రంప్ కార్డ్.. ప్రధాని నరేంద్రమోదీ. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఆ కుర్చీని వదిలి ఎనిమిదేళ్లవుతున్నా.. సొంత రాష్ట్రంపై పట్టు, ప్రజల్లో ఫాలోయింగ్ ఇంకా చెక్కు చెదరలేదు. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లోనూ.. మోదీయే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారతారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.

మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో దూకుడుగా ముందుకెళుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. ఇసుధన్ గద్వి పేరును.. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. తనకొక్క అవకాశం ఇవ్వాలని.. గుజరాత్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించడంతో పాటు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారు. అలాగే.. అయోధ్య రామాలయానికి కూడా తీసుకెళ్తానన్నారు కేజ్రీవాల్. మరో.. రెండు-మూడు రోజుల్లో కాంగ్రెస్ కూడా పూర్తిస్థాయిలో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగే చాన్స్ కనిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే సారథ్యంలో.. గుజరాత్‌లో హస్తం పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

నవంబర్ 5 నుంచే గుజరాత్‌లో నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 15న పరిశీలన, నవంబర్ 17 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈసారి గుజరాత్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. 89అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్ 1న, 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 2017తో పోలిస్తే.. ఈసారి గుజరాత్‌లో పోలింగ్ స్టేషన్లు కూడా పెరిగాయి. గత ఎన్నికల్లో.. 50 వేల 128 ఉండగా.. ఈసారి 51 వేల 782కు పెరిగాయి. ఓటర్లు కూడా బాగానే పెరిగినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా.. 27 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్‌.. ఎలా ఉండబోతుందన్న దానిపై.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.