Hari Hara Veera Mallu: పవర్ స్టార్ కూడా లైన్‌లో ఉన్నాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పీరియాడికల్ ఫాంటెసీ కథగా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో మొదట్నుండీ టాక్ వినిపిస్తోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా హరిహర వీరమల్లు కూడా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
- Anil Aaleti
- Published On : August 13, 2022 / 07:05 PM IST
Hari Hara Veera Mallu Update On The Way
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పీరియాడికల్ ఫాంటెసీ కథగా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో మొదట్నుండీ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?
అయితే షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యిందీ. దీంతో ఈ సినిమా నుండి ఇంకో అప్డేట్ వస్తే బాగుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా హరిహర వీరమల్లు కూడా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమా నుండి అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని.. అందుకే ఈ సినిమా నుండి ఇప్పుడు ఓ అప్డేట్ ఇస్తే వారు సంతోషిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Pawan Kalyan: వీరమల్లు లుక్ నుంచి బయటకొచ్చేసిన పవన్..?
ఇదే గనక నిజమైతే, పవర్ స్టార్ అభిమానులకు నిజంగా పండగ రానుందని చెప్పాలి. ఇలా ఇండిపెండెన్స్ డే కానుకగా హరిహిర వీరమల్లు నుంచి అప్డేట్ వస్తుందని ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తే అది ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. మరి సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే వీరమల్లు అప్డేట్‌తో వస్తున్నాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
