Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?

Hari Hara Veeramallu

Hari Hara Veera Mallu: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెన‌డియ‌న్ బ్యూటీ!

గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికా లాంటి హిస్టారికల్ సినిమాల తర్వాత క్రిష్ చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్య పవన్ ఫైట్స్ కోసం శిక్షణ తీసుకుంటగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోకి భారీ రెస్పాన్స్ దక్కింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి బాగా కేర్ తీసుకుంటున్న మేకర్స్ ఇందుకోసం విదేశీ నిపుణులను కూడా తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమా గురించి ఎప్పుడు ఆ అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

కాగా, ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలిం వర్గాలలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా లో ఒకేసారి వెయ్యిమంది యోధులతో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఆ యాక్షన్ సీన్ సినిమా మొత్తంలో హైలెట్ గా ఉంటుందట. ఈ ఎపిసోడ్ కోసమే పవన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేసే అవకాశం ఉన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.