Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. అనేక ప్రాంతాల్లో కనీసం 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది.

Bangalore Rains: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. అనేక ప్రాంతాల్లో కనీసం 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది. వరదల ప్రభావానికి ఇద్దరు కూలీలు మరణించినట్లు అధికారులు చెప్పారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మంగళవారం సాయంత్రం నుంచి ఉదయం వరకు.. అంటే దాదాపు పన్నెండు గంటలపాటు 114 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ భారీ వర్ష ప్రభావం కారణంగా డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. వర్షపు నీటిలో రోడ్డుపై నిలిచిపోయిన బైకులు, ఇతర వాహనాలు నడవలేని పరిస్థితి. దీంతో చాలా మంది వాహనదారులు, తమ వాహనాలను రోడ్లమీదే వదిలేసి అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లిపోయారు.

Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ

ఆర్ఆర్ నగర్, కోరమంగళ, హోరామ్‌వరు, హెచ్‌బీఆర్ లేఔట్ వంటి ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, హౌజింగ్ కాలనీల్లోకి కూడా నీళ్లు చొచ్చుకొచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చాలామంది అపార్టుమెంట్ల పైకి చేరి తలదాచుకోవాల్సి వచ్చింది. చాలా ఏళ్లుగా వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో నాలుగైదు రోజులపాటు నగరవ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు