Telangana Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం..తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
- bheemraj
- Updated on- August 14, 2022 / 08:05 PM IST
Heavy rains in Telangana (1)
Telangana Heavy Rains : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన పడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది.
Heavy Rain Alert For AP : ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
