Adhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోనే విధానం

పేపర్ ఆధారిత కార్డు.. మన్నిక తక్కువగా ఉండడంతో..దాని స్థానంలో సరికొత్త ప్లాస్టిక్(PVC) ఆధారిత కార్డును అందుబాటులోకి తెచ్చారు.

Adhaar PVC Card: దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఒకే కార్డు పేరుతో ప్రజల కోసం విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ కార్డు.. ఇప్పుడు సరికొత్తగా రూపును సంతరించుకుంది. ఇప్పటివరకు ఉన్న పేపర్ ఆధార్ కార్డు స్థానంలో.. ప్లాస్టిక్ కార్డు తీసుకువచ్చింది UIDAI. పేపర్ ఆధారిత కార్డు.. మన్నిక తక్కువగా ఉండడంతో..దాని స్థానంలో సరికొత్త ప్లాస్టిక్(PVC) ఆధారిత కార్డును అందుబాటులోకి తెచ్చారు. భద్రత పరంగానూ పేపర్ కార్డు కంటే..ఎంతో సురక్షితంగా ఉండేలా ఈ పీవీసీ కార్డులో ఇతర ప్రత్యేకతలు ఉన్నాయి. భద్రతాతో పాటు.. స్పష్టమైన ఫోటో, వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సంతకం చేయబడిన QR కోడ్‌ తో ఈ పీవీసీ కార్డు లభిస్తుంది.

Also read: Unemployement Rate: ఇండియాలో నిరుద్యోగ రేటు తెలంగాణలోనే అత్యల్పం

పీవీసీ ఆధార్ కార్డు కోసం uidai.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. MyAdhaar టాబ్ పై క్లిక్ చేసి.. వచ్చిన ఆప్షన్స్ లో Order Adhaar PVC Card అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ చేసి.. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మొబైల్ కు వచ్చే OTPని ఎంటర్ చేయడంతో పని పూర్తవుతుంది. అయితే కొత్త పీవీసీ కార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

Also read: Facebook-Meta : మెటాకు భారీ షాక్.. కంపెనీ చరిత్రలోనే ఫస్ట్ టైం… మిలియన్ల మంది యూజర్లు లాస్..!

ఇక్కడ మరో గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఒక వేళ సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులందరికి ఒక్కొక్కరిగా పీవీసీ ఆధార్ కార్డు అప్లై చేయాల్సి వస్తే.. వారి వారి మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే అప్లై చేయవచ్చు. కేవలం OTP కోసం.. కుటుంబ సభ్యుల్లో ఎవరి మొబైల్ నెంబర్ నైనా ఉంటే చాలు.. అందిరికి కలిపి ఒకేసారి పీవీసీ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

Also read: Bandi Sanjay : బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ

ట్రెండింగ్ వార్తలు