Bandi Sanjay : బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ

కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

Bandi Sanjay : బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ

Lok Sabha Privileges Committee : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. ప్రివిలేజ్ కమిటీ ముందు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, పోలీసు అధికారులు హాజరయ్యారు. బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీ, పోలీసు అధికారులను ప్రివిలేజ్ కమిటీ ప్రశ్నిస్తోంది. పోలీసులు ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లడం, గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ద్వంసం చేయడం వీడియో క్లిప్పింగుల ఆధారాలపై ప్రివిలేజ్ కమిటీ సీపీని ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి 5వ తేదీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉండటంతో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకు సీఎస్, డీజీపీకి మినహాయింపు ఇచ్చారు. కరీంనగర్ సీపీ, పోలీసుల నుంచి వివరణ తెలుసుకున్నాక సీఎస్, డీజీపీకి మళ్ళీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. జనవరి 2వ తేదీన కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పోలీసులు వ్యవహరించిన తీరుపై గత నెల 21న తెలంగాణ సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

Employees Arrest in AP : పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి : సోము వీర్రాజు

కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. జనవరి 21వ తేదీన ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై తనపై దాడికి సంబంధించిన సాక్ష్యాలు, తన కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకు రావడం, గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేయడం వీడియో క్లిప్పింగుల ఆధారాలను ఎంపీ బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి సమర్పించారు.

తనపై దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సహా బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీని కోరారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్న 317 జీవో మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ‘స్థానికత’ను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని గతంలో బండి సంజయ్ దీక్ష చేశారు