Employees Arrest in AP : పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి : సోము వీర్రాజు

ఏపీలో ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.దీనిపై బీజేపీ నేతల సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయం నిరాకరణచేయాలన్నారు.

Employees Arrest in AP : పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి : సోము వీర్రాజు

Employees Arrest In Ap

Arrest of employees rally in AP : ఏపీలో ఉద్యోగుల అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నారు పోలీసులు. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన క్రమంలో ఉద్యోగులను అడ్డుకొనేందుకు పోలీసులు ఎక్కడిక్కడ భారీగా మోహరించారు. ఛలో విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులను ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు.

ఉద్యోగులను అరెస్ట్ చేయటంపై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఉద్యోగుల్ని అరెస్ట్ చేయటమేంటీ? పోలీసులు కూడా ఉద్యోగులే కదా? ఆ విషయం మర్చిపోయి పోలీసులువ్యవహరించటం సరికాదన్నారు. అంతేకాదు కాదు సీఆర్సీ అనేది పోలీసులకు కూడా వర్తిస్తుందని..ఉద్యోగులు పీఆర్సీ కోసం తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని..వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని మర్చిపోయారని అన్నారు.

Also read : AP Employees : చలో విజయవాడ.. ఉద్యోగుల అరెస్టుల పర్వం

ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుంటే వారిని ప్రభుత్వం అడ్డుకుంటూ అరెస్ట్ లతో తన అనాలోచిత ధోరణిణి మరోసారి బయటపెడుతోందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పోలీసులకు కూడా పీఆర్సీ వర్తిస్తుందనే విషయం గుర్తించాలని పోలీసులు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని 10టీవీతో మాట్లాడుతూ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ప్రభత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

కాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు కల్పించే అడ్డంకులను ఉద్యోగులు కొనసాగిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ముందుకు కదులుతున్నారు. న్యాయబద్ధమైన తమ హక్కులను కాలరాయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులను అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి వేలాది మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డు వైపు వెళ్తున్నారు.

Also read : AP PRC Issue : విజయవాడలో ఫుల్ టెన్షన్.. మారువేషాల్లో వస్తున్న ఉద్యోగులు

ప్రభుత్వ తీరును మహిళా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తు దానికి సంబంధించి నిరసన పాటలు పాడుతున్నారు. మా గోడు వినండి సీఎం గారూ అంటూ పాటలు పాడుతు వినతి చేస్తున్నారు. సీఎం గారు సలహాదారుల మాట వినకుండా..సొంతంగా ఆలోచించి తమ సమస్యలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని..ఎన్ని ఇబ్బందుల్ని కల్పించినా తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేస్తున్నారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయలు మాట్లాడుతూ..‘‘తాము బడిలో పిల్లలకు పాఠాలు చెపుతాం… ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెపుతాం’’అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని ఆదోపించారు. ఇటువంటి నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పిన జగన్… ఇప్పుడు తాడేపల్లిలోని నివాసానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేతలగా ఉన్న సీఎం ఈనాడు అధికారంలోకి వచ్చాక అసలు సీఎం ఉన్నారా? లేదా? అనేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు మహిళా ఉపాధ్యాయులు.