AP PRC Issue : విజయవాడలో ఫుల్ టెన్షన్.. మారువేషాల్లో వస్తున్న ఉద్యోగులు

కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు. విజయవాడ - నందిగామ రహదారి

AP PRC Issue : విజయవాడలో ఫుల్ టెన్షన్.. మారువేషాల్లో వస్తున్న ఉద్యోగులు

Chalo Vijayawada

AP PRC Issue : విజయవాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు విజయవాడకు ఉద్యోగులు తరలివస్తున్నారు. కరోనా ఆంక్షల కారణంగా.. చలో విజయవాడకు అనుమతినివ్వలేదు. ఎవరూ గుమికూడవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీరిని అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చెక్ పోస్టులు, జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ఉద్యోగులయితే..వారిని వెనక్కి పంపుతున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read More : Neha Sshetty : ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా అడిగిన జర్నలిస్ట్.. ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

దీంతో ఆ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తేల్చిచెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. అడుగడుగునా నిఘా కెమెరాలు పెట్టారు. అన్ని జిల్లాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు.. ఎక్కడ చూసిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులు, ఉద్యోగ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Read More : Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి

కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు. విజయవాడ – నందిగామ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు అటుగా వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేనందున అరెస్ట్‌ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.