Vishal Injured in Shooting : మళ్ళీ షూటింగ్ లో హీరో విశాల్ కు గాయాలు.. వరుస గాయాలతో సతమతవుతున్న విశాల్..

ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్ లో మూడు సార్లు గాయాలపాలయ్యాడు విశాల్. దాని వల్ల సినిమా షూట్ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా మరో సినిమా షూటింగ్ లో మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డాడు విశాల్.

Vishal

 

Vishal Injured in Shooting :  సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం కొంతమంది హీరోలు నిజంగా రిస్క్‌ చేస్తారు. అలాంటి హీరోల్లో విశాల్‌ ఒకరు. చాలా వరకు విశాల్ ఫైట్ సీక్వెన్స్ లలో డూప్ లేకుండానే చేసి అభిమానులను మెప్పిస్తాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ల వల్ల ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్‌.

ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్ లో మూడు సార్లు గాయాలపాలయ్యాడు విశాల్. దాని వల్ల సినిమా షూట్ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా మరో సినిమా షూటింగ్ లో మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డాడు విశాల్. తన కొత్త సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. గురువారం ఉదయం చెన్నైలో తన కొత్త సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా విశాల్ కి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే విశాల్ ని హాస్పిటల్ కు తరలించారు చిత్ర యూనిట్.

Shanmukh Fans Fires on Geetu : బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ ఏడ్చేసిన గీతూ.. నువ్వు చేయలేదా అంటూ షన్ను ఫ్యాన్స్ ఫైర్..

విశాల్ మరోసారి గాయపడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాతలు కూడా విశాల్ డూప్ పెట్టుకుంటే మంచిదని, తన మీద కోట్లలో డబ్బు పెడుతున్నామని, ఏమన్నా జరిగితే కష్టమని అభిప్రాయపడుతున్నారు.