Shanmukh Fans Fires on Geetu : బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ ఏడ్చేసిన గీతూ.. నువ్వు చేయలేదా అంటూ షన్ను ఫ్యాన్స్ ఫైర్..

గతంలో గీతూ బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పింది. ఆ సమయంలో షణ్ముఖ్ ని ఒక ఆట ఆడుకుంది. షణ్ముఖ్ ని బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసింది గీతూ. ఇప్పుడు గీతూ బాడీ షేమింగ్ గురించి....

Shanmukh Fans Fires on Geetu : బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ ఏడ్చేసిన గీతూ.. నువ్వు చేయలేదా అంటూ షన్ను ఫ్యాన్స్ ఫైర్..

shanmukh jashwanth

Shanmukh Fans Fires on Geetu :  సోషల్ మీడియాలో రీల్స్ తో ఫేమస్ అయిన గీతూ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలలో పాల్గొంటూ తన చిత్తూరు స్లాంగ్ తో అందర్నీ మెప్పిస్తుంది. ఏ షోలు చేసిన ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం మారదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ”తనను చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్‌ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా బాడీ షేమింగ్‌ చేశారు. నేను చాలా వరకు బాడీని కవర్‌ చేసేలా డ్రెస్సులు వేసుకుంటాను. ఇటీవలే నా కజిన్స్‌, ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ముందు నా బాడీని ప్రేమించమని చెప్పారు. నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్‌ చేయొద్దు” అంటూ ఏడ్చేసింది గీతూ.

అయితే ఈ వీడియోని చూసి షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ గీతూని ట్రోల్ చేస్తున్నారు. గతంలో గీతూ బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పింది. ఆ సమయంలో షణ్ముఖ్ ని ఒక ఆట ఆడుకుంది. షణ్ముఖ్ ని బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసింది గీతూ. ఇప్పుడు గీతూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడటంతో షన్ను ఫ్యాన్స్.. నువ్వు గతంలో షణ్నును బాడీ షేమింగ్‌ చేయలేదా? అతడిని తిట్టలేదా? ఇప్పుడు నిన్ను అంటే తప్పా? అని కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తన్నారు.

Tamannaah : హీరోలకిచ్చే మర్యాద హీరోయిన్స్ కి ఇవ్వరు.. హీరోలని ప్రేమించే పాత్రలు తప్ప ఇంకేం ఉండవు..

గీతూ ఈ ట్రోల్స్ పై తాజాగా స్పందిస్తూ.. ” బిగ్‌బాస్‌ గేమ్‌ జడ్జ్‌ చేయడమే నా పని. మీ వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. బిగ్‌బాస్‌ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేమి కావాలని సింపతీ క్రియేట్‌ చేసుకోవట్లేదు. ఇంకా పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్‌ అంటారు. కొంచెం మారండి” అని చెప్పింది. ఇలా అప్పుడు చేశాను, కానీ అది నా వర్క్, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం అని చెప్పడంతో షన్ను ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరింత ట్రోల్ చేస్తున్నారు గీతూని.