Tamannaah : హీరోలకిచ్చే మర్యాద హీరోయిన్స్ కి ఇవ్వరు.. హీరోలని ప్రేమించే పాత్రలు తప్ప ఇంకేం ఉండవు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ''సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు. వీటి గురించి లేడి ఆర్టిస్టులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నేను పనిచేసిన సినిమాల్లో............

Tamannaah : హీరోలకిచ్చే మర్యాద హీరోయిన్స్ కి ఇవ్వరు.. హీరోలని ప్రేమించే పాత్రలు తప్ప ఇంకేం ఉండవు..

Tamannaah

Tamannaah :  సినీ పరిశ్రమలలో హీరోలకి, హీరోయిన్స్ కి, అలాగే మిగిలిన ఆర్టిస్టుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు. ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారికి సౌకర్యాలు, మర్యాదలు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కొంతమంది దీనిపై బహిరంగంగానే మాట్లాడతారు. ఇటీవల కొంతమంది హీరోయిన్స్ హీరోలని ఒకలా, మమ్మల్ని ఒకలా చూస్తారు అని అన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి తమన్నా చేరింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు. వీటి గురించి లేడి ఆర్టిస్టులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నేను పనిచేసిన సినిమాల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే, సజెషన్స్ ఇస్తే టెక్నీషియన్స్ వాటిని పట్టించుకునేవారు కాదు. మహిళలకు సినిమా రంగంలో సరైన మర్యాద లేదు. ఎక్కువగా హీరోయిన్స్ అంటే హీరోలని ప్రేమించే పాత్రలకే తీసుకుంటారు. ఒకప్పుడు నా విషయంలో కూడా ఇదే జరిగింది.”

Tabu : ట్రక్‌ అద్దాలు పగిలి గాజుముక్కలు గుచ్చుకొని.. షూటింగ్ లో టబుకి గాయాలు..

”ఇక పారితోషికం గురించి చెప్పక్కర్లేదు. హీరోలకి ఇచ్చేదాంట్లో సగం కూడా ఇవ్వరు. గుర్తింపు అసలు ఉండదు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం చేస్తారు. ఈ పరిస్థితులు మారాలి” అని తెలిపింది. ఇటీవల F3 ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొనకపోవడంతో అనిల్ రావిపూడికి, తమన్నాకి విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.