Tabu : ట్రక్‌ అద్దాలు పగిలి గాజుముక్కలు గుచ్చుకొని.. షూటింగ్ లో టబుకి గాయాలు..

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ సరసన 'భోలా’ సినిమాలో నటిస్తుంది టబు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ట్రక్‌ ఛేజింగ్‌ సీన్‌..........

Tabu : ట్రక్‌ అద్దాలు పగిలి గాజుముక్కలు గుచ్చుకొని.. షూటింగ్ లో టబుకి గాయాలు..

Tabu

Tabu :  షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ కి ప్రమాదాలు జరగడం మామూలే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే ఆర్టిస్టులకి గాయలవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుంటూ సినిమా షూటింగ్స్ ని చేస్తారు ఆర్టిస్టులు. తాజాగా అలనాటి హీరోయిన్ టబు ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో గాయపడింది.

Rashmika Mandanna : నా సినిమాల గురించి అడగండి.. నా బాయ్‌ఫ్రెండ్ గురించి కాదు.. విజయదేవరకొండతో డేటింగ్ పై రష్మిక వ్యాఖ్యలు..

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ సరసన ‘భోలా’ సినిమాలో నటిస్తుంది టబు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ట్రక్‌ ఛేజింగ్‌ సీన్‌ షూట్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ట్రక్‌ అద్దాలు పగిలి టబూకు గుచ్చుకున్నాయి. దీంతో టబుకి గాయాలయ్యాయి. సెట్‌లోనే ప్రథమ చికిత్స అందించి ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించారు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ ని రెండు రోజులు నిలిపేశారు.