Rashmika Mandanna : నా సినిమాల గురించి అడగండి.. నా బాయ్‌ఫ్రెండ్ గురించి కాదు.. విజయదేవరకొండతో డేటింగ్ పై రష్మిక వ్యాఖ్యలు..

రష్మిక సమాధానమిస్తూ.. ''నేను నటిని. సంవత్సరానికి ఒక అయిదారు సినిమాలు చేస్తున్నాను. మీరు నా సినిమాల గురించి అడగండి. అంతే కానీ మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు? ఎవరితో డేట్‌ చేస్తున్నారు?..........

Rashmika Mandanna : నా సినిమాల గురించి అడగండి.. నా బాయ్‌ఫ్రెండ్ గురించి కాదు.. విజయదేవరకొండతో డేటింగ్ పై రష్మిక వ్యాఖ్యలు..

Rashmika Mandanna :  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక ప్రస్తుతం సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో బిజీ అవుతుంది. ఇటీవల విజయ్, రష్మిక గురించి ఎక్కువగా వినిపిస్తుంది. విజయ్ తో రష్మిక ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కాఫీ విత్ కరణ్ షోలో పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్, రష్మిక గురించి మాట్లాడటంతో వీళ్లు నిజంగానే రిలేషన్ లో ఉన్నారు అని అంతా భావిస్తున్నారు.

దీనిపై ఇద్దరిలో ఎవరిని అడిగినా మేము మంచి స్నేహితులం అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ముంబైలో తిరుగుతున్నారని సమాచారం. విజయ్, రష్మిక ఎవరు మీడియా ముందుకి వచ్చినా వీళ్ళ రిలేషన్ గురించి కచ్చితంగా అడుగుతున్నారు. తాజాగా రష్మిక బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడ కూడా విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు విజయ్ తో డేటింగ్ చేస్తున్నారంట నిజమేనా అని అడిగారు.

Lokesh Kanagaraj : ఖైదీ 2 పై కార్తీ ప్రకటన.. వచ్చే సంవత్సరం మొదలవ్వొచ్చు..

దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ”నేను నటిని. సంవత్సరానికి ఒక అయిదారు సినిమాలు చేస్తున్నాను. మీరు నా సినిమాల గురించి అడగండి. అంతే కానీ మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు? ఎవరితో డేట్‌ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంపై ఉన్న ఆసక్తి కారణంగానే మీరంతా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నా నోటితో నేను చెప్పేంతవరకు ఇలాంటి వార్తలని ఎవరూ సీరియస్‌గా తీసుకోకండి. ఈ వార్తలని జస్ట్ విని ఎంజాయ్‌ చేసి వదిలేయండి” అని చెప్పింది. మళ్ళీ విజయ్ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇవ్వలేదని నిరాశ చెందారు నెటిజన్లు. మరి దీనిపై విజయ్, రష్మిక ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.