Lokesh Kanagaraj : ఖైదీ 2 పై కార్తీ ప్రకటన.. వచ్చే సంవత్సరం మొదలవ్వొచ్చు..

కార్తీ ఖైదీ 2 గురించి మాట్లాడుతూ.. ''వచ్చే ఏడాది చివర్లో ఖైదీ-2 ప్రారంభమయ్యే అవకాశముంది. నేను కూడా దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం లోకేష్..............

Lokesh Kanagaraj : ఖైదీ 2 పై కార్తీ ప్రకటన.. వచ్చే సంవత్సరం మొదలవ్వొచ్చు..

khaidi movie

 

Lokesh Kanagaraj :  తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి భారీ విజయం సాధించాడు. గతంలో అతను తీసిన ఖైదీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఖైదీ, విక్రమ్ రెండు సినిమాలకి కూడా పార్ట్ 2 ఉంటుందని లీడ్ ఇచ్చి వదిలేసాడు లోకేష్. దీంతో ఈ సినిమాల పార్ట్ 2 గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల విక్రమ్ సక్సెస్ కార్యక్రమాల్లో కూడా ఖైదీ, విక్రమ్ సినిమాలకి పార్ట్ 2 ఉంటుందని ప్రకటించాడు లోకేష్. దీంతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి అని ఎదురు చూస్తున్నారు.

అయితే లోకేష్ ప్రస్తుతం విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం చివరికి అయిపోయే ఛాన్సులు ఉన్నాయి. తాజాగా హీరో కార్తీ తన కొత్త సినిమా ‘విరుమాన్‌’ ప్రమోషన్స్ లో ఖైదీ సినిమా పార్ట్ 2 గురించి మాట్లాడాడు.

Toronto International Film Festival 2022 : టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి.. హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినీ చర్చలు..

కార్తీ ఖైదీ 2 గురించి మాట్లాడుతూ.. ”వచ్చే ఏడాది చివర్లో ఖైదీ-2 ప్రారంభమయ్యే అవకాశముంది. నేను కూడా దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక ఖైదీ 2 పనులు మొదలుపెడతాడు” అని తెలిపారు. దీంతో సినీ ప్రేమికులు ఈ సినిమా త్వరగా రావాలని కోరుకుంటున్నారు. అప్పుడే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.