మీ ఐఫోన్ స్లో అయిందా? Cache ఇలా క్లియర్ చేయండి!

మీ ఐఫోన్ స్లో అయిందా? అయితే వెంటనే cache (క్యాచీ) క్లియర్ చేసేయండి. మీరు మీ ఫోన్లోని మెమరీని ఫ్రీ అప్ చేయండి లేదా ఐఫోన్ స్పీడ్ బూస్ట్ కోసం cache క్లియర్ చేయడమే మంచిది. సాధారణంగా మీ ఐఫోన్ స్టోర్ మెమెరీలో ప్రత్యేక యాప్స్ కారణంగా క్యాచీ స్టోర్ అవుతుంది. ప్రత్యేకించి సఫారీ బ్రౌజర్, ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ఫేస్ బుక్, స్పాటిఫై, టిండర్ కారణంగా కూడా క్యాచీ స్టోర్ అవుతుంది. ఐఫోన్ క్యాచీని క్లియర్ చేయడానికి ముందు మీరు ఎలా చేస్తున్నారో ఓసారి గమనించండి.
లేదంటే.. మీ యాప్ డేటా కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. యాప్ లోని క్యాచీని మాత్రమే క్లియర్ చేయాల్సి ఉంటుంది. యాప్స్ ద్వారా స్టోర్ అయిన డేటాను మీరు డిలీట్ చేస్తున్నారని గమనించండి. చాలా సందర్భాల్లో మీరు వాడే యాప్స్ సరిగా పనిచేయాలంటే ఈ Cache తప్పనిసరిగా ఉండాలి. లేదా Settingsలోని your preferences కనీసం గుర్తించుకోండి. అందులో ఏదైనా ఫైల్స్ సేవ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా ఐఫోన్ యాప్ క్యాచీ క్లియర్ చేయడానికి ముందు కచ్చితంగా ఈ విషయం గుర్తించుకోవాలి. మీరు డిలీట్ చేసే ఆ డేటా అవసరం లేదనకుంటే క్లియర్ చేసేయొచ్చు.
ఐఫోన్ Safariలో cache క్లియర్ చేయాలంటే :
ముందుగా మీ ఫోన్లోని మెమెరీని ప్రీ అప్ చేయండి. ఐఫోన్ పర్ఫార్మెన్స్ ద్వారా సఫారీ క్యాచీని క్లియర్ చేయొచ్చు. అది ఎలానో ఓసారి లుక్కేయండి.
Step 1 : Go to Settings > Safari పై క్లిక్ చేయండి. స్ర్కోల్ డౌన్ చేసి Clear history, Website Dataపై ట్యాప్ చేయండి. ఆ
తర్వాత Clear History, Dataపై టాప్ చేయండి.
Step 2 : go to Settings > Safari లోకి వెళ్లండి. Safari Settings menuను కిందికి స్ర్కోల్ డౌన్ చేయండి. Advanced > Website Data ఆప్షన్ పై Tap చేయండి. చివరిగా Remove All website Dataపై ట్యాప్ చేయండి. అప్పుడు Remove nowపై క్లిక్ చేయండి.
ఐఫోన్లలో సఫారీ క్యాచీ క్లియర్ చేయండి. వెబ్‌సైట్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్‌సైట్ కుకీలను క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్స్‌లోనూ క్యాచీ క్లియర్ చేయొచ్చు. సఫారీ తోపాటు ఇతర థర్డ్ పార్టీ యాప్స్ cache కూడా క్లియర్ చేయొచ్చు. డేటా క్లియర్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డిలీట్ చేయొచ్చు. అప్పుడు మళ్లీ యాప్ రీఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. మరోలా కూడా థర్డ్ పార్టీ యాప్స్ క్యాచీని క్లియర్ చేయొచ్చు.
Step 1 : Go to Settings > General > iPhone Storage ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యాప్స్ లిస్టును కిందికి స్ర్కోల్ డౌన్ చేయండి. మీరు ఏ యాప్ క్లియర్ చేయాలో దానిపై Tap చేయండి.
Step 2: Delete App బటన్‌పై Tap చేయండి. Delete App బటన్‌పై Tap చేసి Confirm చేయండి.
Step 3: ఒకవేళ మీరు యాప్ రీ ఇన్ స్టాల్ చేయాలనుకుంటే (ఎలాంటి డాక్యుమెంట్లు, డేటా లేకుండా డిలీట్ చేస్తే) App స్టోర్ లోకి వెళ్లి reinstall చేయండి.
మిగతా యాప్స్‌లోనూ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. క్యాచీ డేటాను క్లియర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏ యాప్ క్యాచీ డేటాను క్లియర్ చేస్తున్నారో ఓసారి నిర్ధారించుకున్నాక మాత్రమే చేయాల్సి ఉంటుంది.
Read Here>> Conference Calls చేస్తున్నారా.. బిల్లులు పెంచేసిన Trai