Artificial Sweetener : కృత్రిమ స్వీటెనర్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి పిల్లలు నివారించాల్సిన ఆహారాలు

రోజువారిగా నిర్ణీతస్ధాయిలో వినియోగించినప్పుడు అస్పర్టమే పిల్లలు మరియు పెద్దలకు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. జీవితకాలంలో ప్రతిరోజూ గరిష్టమొత్తంలో వినియోగిస్తే మాత్రం ఆరోగ్య ప్రమాదంలో పడుతుంది. పిల్లల ఆరోగ్యంపై అస్పర్టమే ప్రభావంపై ఇటీవలి కాలంలో అందరి ఆందోళన నెలకొంది.

artificial sweetener

Artificial Sweetener : అస్పర్టమే ఇది ఒక రకమైన కృత్రిమ స్వీటెనర్. మనుషులలో క్యాన్సర్ కు దారితీస్తుంది WHO ప్రకటించింది. డైట్ డ్రింక్స్, షుగర్ లేని చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, అల్పాహారం ,తృణధాన్యాలు, టూత్‌పేస్ట్ , దగ్గు , చుక్కల మందులు, నమలగల విటమిన్ల వరకు అస్పర్టమే కొంత మొత్తంలో వినియోగిస్తారు.

READ ALSO : Artificial Sweeteners : చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే విషయాలను గుర్తుంచుకోండి..

చక్కెర అస్పర్టమే కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. అనేక చక్కెర రహిత ఉత్పత్తులకు అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్ ను ఉపయోగిస్తారు. అస్పర్టమేను ఉపయోగించి తయారుచేస్తున్న ఉత్పత్తులలో చాలా వరకు పిల్లలు వినియోగిస్తుంటారు. తల్లిదండ్రులు క్యాన్సర్‌కు కారణమయ్యే ఈ ఆహార పదార్థాలను పిల్లలు తీసుకోవడాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.

అస్పర్టమే పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

అస్పర్టమే అనేది తక్కువ కేలరీల కృత్రిమ స్వీటెనర్. దీనిని వివిధ ఆహారాలు, పానీయాలలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ,యూరోపియన్ యూనియన్ తో సహా అనేక దేశాలలో ఉపయోగం కోసం అమోదించారు. రోజువారిగా నిర్ణీతస్ధాయిలో వినియోగించినప్పుడు అస్పర్టమే పిల్లలు మరియు పెద్దలకు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. జీవితకాలంలో ప్రతిరోజూ గరిష్టమొత్తంలో వినియోగిస్తే మాత్రం ఆరోగ్య ప్రమాదంలో పడుతుంది. పిల్లల ఆరోగ్యంపై అస్పర్టమే ప్రభావంపై ఇటీవలి కాలంలో అందరి ఆందోళన నెలకొంది. దీనిని తీసుకోవటం వల్ల పిల్లల్లో కొన్ని వ్యాధి కారణకార లక్షణాలు బహిర్గతమైనట్లు నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?

1. అలర్జీలు: కొంతమందిలో అస్పర్టమేకి అలెర్జీలకు దారి తీస్తుంది. తలనొప్పి, మైకము, జీర్ణశయాంతర సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అస్పర్టమే ఉన్న ఉత్పత్తులను తీసుకున్న తర్వాత పిల్లలు ఇలాంటి లక్షణాలకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్య పొందాలి.

2. ఫినైల్‌కెటోనూరియా (PKU): ఫినైల్‌కెటోనూరియా అని పిలువబడే అరుదైన జన్యుపరమైన రుగ్మత ఉన్న పిల్లలు అస్పర్టమేను నివారించాలి. PKU అస్పర్టమేలో ఉండే అమైనో ఆమ్లం అయిన ఫెనిలాలనైన్‌ను జీవక్రియను ప్రభావితం చేస్తుంది. మెదడుకు సంబంధించిన వైకల్యాలను నివారించడానికి ఖచ్చితంగా తక్కువ-ఫినిలాలనైన్ ఆహారాన్ని తీసుకోవాలి.

3. బరువు నిర్వహణ: అస్పర్టమే తక్కువ కేలరీలు లేదా చక్కెర-రహిత ఉత్పత్తులలో చక్కెర కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. ఇది సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. అయినప్పటికీ, కృత్రిమంగా తీపి ఉత్పత్తులను తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చన్నది ఏమాత్రం ఖచ్చితమైనది కాదని గుర్తుంచుకోవాలి. సమతుల్య ఆహారం , సాధారణ శారీరక శ్రమ పిల్లలకు ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది.

READ ALSO : Sugar Free Sweeteners : బరువు తగ్గడానికి చక్కెర లేని స్వీటెనర్లను ఉపయోగించకూడదా ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ?

4. నరాలపై ప్రభావం : కొన్ని అధ్యయనాలు అస్పర్టమే వినియోగం పిల్లలలో హైపర్యాక్టివిటీ లేదా అటెన్షన్ డిజార్డర్స్ వంటి నరాల సంబంధిత సమస్యలకు గురైనట్లు పరిశోధనల్లో తేలింది. అయితే దీనిపై లోతైన పరిశోధన అవసరం.

5. తలనొప్పులు , మైగ్రేన్‌లు: పిల్లలతో సహా కొంతమంది పెద్దలు అస్పర్టమే తీసుకున్న తర్వాత తలనొప్పి , మైగ్రేన్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

6. జీర్ణశయాంతర సమస్యలు: అరుదైన సందర్భాల్లో, అస్పర్టమే వినియోగం ఉబ్బరం, గ్యాస్ , డయేరియా వంటి జీర్ణశయాంతర లక్షణాలకు దారితీస్తుంది.

READ ALSO : High Sugar Consumption : అధిక చక్కెర వినియోగం ప్రవర్తనపై ప్రభావం చూపుతుందా? ఇందులో వాస్తవ మెంత ?

7. క్యాన్సర్: IARC అస్పర్టమేని క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. దీని అర్థం అస్పర్టమే క్యాన్సర్‌కు కారణమవుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి, అయితే దీన్ని నిర్ధారించడానికి పరిశోధన అవసరం.

8. బరువు పెరుగుట: అస్పర్టమే ఆహార పదార్ధాలు, పానీయాలలో ఉపయోగించబడుతుంది, అయితే ఇది వాస్తవానికి బరువు తగ్గడంలో సహాయపడదు. అస్పర్టమే బరువు పెరగడానికి దారితీస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

అస్పర్టమే ఉన్న ఆహారాల జాబితా, పిల్లలు వాటిని తప్పనిసరిగా నివారించాలి ;

డైట్ సోడాలు: కోలా , ఫ్రూట్ ఫ్లేవర్ రకాలతో సహా అనేక డైట్ శీతల పానీయాలలో చక్కెర ప్రత్యామ్నాయంగా అస్పర్టమే ఉంటుంది. వాటిని తాగకుండా ఉండటమే మంచిది.

READ ALSO : Blood Sugar : రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడే ఆయుర్వేద మూలికలు ఇవే !

చక్కెర రహిత మిఠాయిలు, గమ్: అస్పర్టమే సాధారణంగా క్యాండీలు, చూయింగ్ గమ్, పుదీనా వంటి చక్కెర-రహిత మిఠాయి ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. వాటిని అధిక మోతాదులో తీసుకోకూడదు.

పెరుగు: కొన్ని రుచులతో లభించే పెరుగు కప్స్ లో ముఖ్యంగా లైట్ లేదా షుగర్-ఫ్రీ అని లేబుల్ వేయబడిన వాటిలో అస్పర్టేమ్‌ను స్వీటెనర్‌ను ఉపయోగిస్తారు.

చక్కెర-రహిత పుడ్డింగ్‌లు, జెలటిన్ డెజర్ట్‌లు: కొన్ని చక్కెర-రహిత డైట్ ఫుడ్ లలో జెలటిన్ డెజర్ట్‌లలో అస్పర్టమే ఉండే అవకాశాలు ఉంటాయి.

పండ్ల రసాలు, పానీయాలు: తక్కువ కేలరీలు, షుగర్-ఫ్రీ గా విక్రయించబడే కొన్ని పండ్ల రసాలు, పానీయాలు అస్పర్టమే ఉపయోగించి స్వీటెనర్‌గా మారుస్తారు.

READ ALSO : Blood Sugar : రక్తంలో అధిక చక్కెర స్ధాయిలను నియంత్రించటంలో సహాయపడే ముల్లంగి!

రెడీటూ ఈట్ వోట్మీల్ , అల్పాహార తృణధాన్యాలు: తక్కువ చక్కెర కలిగిన వాటిగా విక్రయించబడే కొన్ని రెడీటూ ఈట్ వోట్మీల్ ప్యాకెట్లు , అల్పాహారం తృణధాన్యాలు అస్పర్టమే కలిగి ఉంటాయి.

ప్రోటీన్ బార్‌లు, షేక్‌లు: కొన్ని ప్రోటీన్ బార్‌లు , షేక్‌లు, ప్రత్యేకించి బరువు తగ్గడానికి , భోజనానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పదార్ధాలలో అస్పర్టమేని ఉపయోగిస్తారు.

షుగర్ ఫ్రీ ఐస్ క్రీం : కొన్ని చక్కెర లేని ఐస్ క్రీం, అస్పర్టమేను చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

READ ALSO : Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్ధాయిలను స్ధిరీకరించే గ్రీన్ ఆపిల్ !

కాల్చిన స్నాక్స్: అస్పర్టమే కొన్ని చక్కెర లేని, తక్కువ చక్కెరతో కాల్చిన పదార్ధాలు, కుకీలు, కేకులు , చిరుతిళ్లలో ఉపయోగిస్తారు.

కాబట్టి అలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండటం మంచిది. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు , డైరీ ప్రత్యామ్నాయాలు వంటి వివిధ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి.

ట్రెండింగ్ వార్తలు