Blood Sugar : రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడే ఆయుర్వేద మూలికలు ఇవే !

మధుమేహం ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ సులభంగా , సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ఒక సాధారణ జీవనశైలి వ్యాధి, శరీరం యొక్క ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవటంతోనే ఈపరిస్ధితి తలెత్తుతుంది.

Blood Sugar : రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడే ఆయుర్వేద మూలికలు ఇవే !

High Blood Sugar

Blood Sugar : డయాబెటిస్ అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇందులో ఇండియా రెండో స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ సులభంగా , సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ఒక సాధారణ జీవనశైలి వ్యాధి, శరీరం యొక్క ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవటంతోనే ఈపరిస్ధితి తలెత్తుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆయుర్వేదం కొన్ని మూలికా చికిత్సలను సిఫార్సు చేస్తుంది. ఈ మూలికా చికిత్సలు ప్యాంక్రియాస్‌ను బలోపేతం చేయటంతోపాటుగా, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆయుర్వేద మూలికలు ;

1. ఉసిరికాయ: ఇండిన్ గూస్బెర్రీ గా ఉసిరికాయకు పేరుంది. చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ దీనిలో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం చికిత్స కోసం ఆయుర్వేద వైద్యులు ఉసిరి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

READ ALSO : Deep Sleep : గాఢమైన నిద్రకు ఉపకరించే సుగంధ ద్రవ్యాలు ఇవే !

2. కాకర రసం: చేదుగా ఉండే కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు కాకరసం నుండి ప్రయోజనం కలుగుతుంది.

3. త్రిఫల: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో త్రిఫల చూర్ణం బాగా ఉపకరిస్తుంది. ఇది ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది, ఇన్సులిన్ స్రవించటాన్ని ప్రోత్సహిస్తుంది.

READ ALSO : Prediabetes : యువతలో ప్రీడయాబెటిస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా? సర్వేలు ఏంచెబుతున్నాయ్

4. వేప: వేప ఆకులతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించుకోవచ్చు. వేప ఆకులను చూర్ణం చేసుకుని నీటిలో వేసి మరిగించుకోవాలి. మరగించిన సారాన్ని వడకట్టుకుని తర్వాత ఈ డికాషన్ తీసుకోవాలి. గ్లూకోజ్ ద్వారా వచ్చే హైపర్గ్లైసీమియా చికిత్సకు ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో ఇది సహాయపడతుంది.