సిగ్నల్ యాప్ ఎలా వాడాలో.. ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలో తెలుసా

సిగ్నల్ యాప్ ఎలా వాడాలో.. ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలో తెలుసా

Updated On : January 11, 2021 / 6:47 AM IST

Signal App: సిగ్నల్ ఆల్రెడీ నెంబర్ వన్ యాప్ అయిపోయింది. యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లలో 10మిలియన్ వరకూ డౌన్‌లోడ్‌లు అయ్యాయి. వాట్సప్ నోటిఫికేషన్ల విషయంలో, సర్వీసు నిబంధనల అంశంలో తెచ్చిన మార్పులతో సిగ్నల్ యాప్ కు అవకాశం దక్కింది. అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ పబ్లిక్‌గా సిగ్నల్ వాడమంటూ రికమెండ్ చేశారు.

ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌లలోనూ అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లకు ఐఓఎస్9.0 ఆ తర్వాత ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్ టచ్ మోడల్స్ లో మాత్రమే సెట్ అవుతుంది. యాండ్రాయిడ్ యూజర్లు ఆండ్రాయిడ్ 4, అంతకంటే హైయ్యర్ వర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది.

* గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
* యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లేస్టోర్ లో ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* ఐఫోన్ యూజర్లు Get మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి.
* ఇన్‌స్టాల్ ను సెలక్ట్ చేసుకోవాలి.. దాంతో పాటు యాపిల్ ఐడీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి.
* ఓపెన్ బటన్ పై ట్యాప్ చేయాలి.
* ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఐఫోన్ యూజర్లు మాత్రం యాక్టివ్ దిస్ డివైజ్ సెలక్ట్ చేయాలి.
* ఆరు డిజిట్ల కోడ్ ఎసెమ్మెస్ లో వస్తుంది.
* కోడ్ వెరిఫై అయిన తర్వాత .. నోటిఫికేషన్స్ కు పర్మిషన్ అడుగుతుంది.
* ప్రొఫైల్ పిక్చర్, నేమ్ ఎంటర్ చేసుకుని యాప్ లో కాంటాక్ట్స్ ను చూసుకోవచ్చు.
* కావాలంటే.. గ్రూపులు సెలక్ట్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో మెసేజ్ లు చేయొచ్చు. ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.