Tiger Scare
Tiger Scare: కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెంలో మూడు బోన్లు ఏర్పాటు చేసి, మాంసాన్ని ఎరగా వేశారు. అయినా పులి చిక్కలేదు. రెండు రోజుల క్రితం పులి ఒక బోను దగ్గరికి వచ్చి, చిక్కకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది.
Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అధికారులు పులిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పులి చిక్కకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. వ్యవసాయం, కూలి పనులకు వెళ్లే వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.