Husband Attacks Wife : భార్యపై దాడి..మృతి-భర్త ఆత్మహత్య

కుటుంబ కలహాలతో భర్త,భార్యను కొట్డాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. భార్య చనిపోవటంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Wife Died Husbad Suicide

Husband Attacks Wife :  గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త,భార్యను కొట్డాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. భార్య చనిపోవటంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరు చిన్నపిల్లలు అనాధలయ్యారు. పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రుకు చెందిన ఏసుబాబు(30) భార్య మనీషాతో జీవిస్తున్నాడు. వారికి ఇద్దరు మగపిల్లలు.

భార్య ప్రవర్తనపై ఏసుబాబు కు అనుమానం కలిగింది. ఈవిషయమై ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఇటీవల ఇద్దరిమధ్య గొడవ జరిగింది.దీంతో ఏసుబాబు కోపం పట్టలేక రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మనీషాను ఆమె తల్లి తండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మనీషా సోమవారం మరణిచింది.
Also Read : Online Shopping : ప్రముఖ నటుడుకి షాక్ …. యాపిల్ వాచ్ బుక్ చేస్తే రాయి వచ్చింది
భార్య మరణించిందని సమాచారం 0తెలియడంతో ఏసుబాబు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తండ్రులు ఇద్దరూ మరణించటంతో  ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. కేసు నమోదు చేసుకున్నపొన్నూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.