Online Shopping : ప్రముఖ నటుడుకి షాక్ …. యాపిల్ వాచ్ బుక్ చేస్తే రాయి వచ్చింది

ఆన్ లైన్ షాపింగ్ లో ఒకటి బుక్ చేసుకుంటే మరోకటి వచ్చిందని వినియోగ దారులు గగ్గోలు పెడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. 

Online Shopping : ప్రముఖ నటుడుకి షాక్ …. యాపిల్ వాచ్ బుక్ చేస్తే రాయి వచ్చింది

Brazil Actor Murilo Benício

Online Shopping :  ఆన్ లైన్ షాపింగ్ లో ఒకటి బుక్ చేసుకుంటే మరోకటి వచ్చిందని వినియోగ దారులు గగ్గోలు పెడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం.  అది ఉత్పత్తిదారుడి తప్పా, వెబ్ సైట్ నిర్లక్ష్యమా…. డెలివరీ ఏజెన్సీలో జరిగిన మోసమా అనేది పక్కన పెడితే చివరికి నష్టపోయేది వినియోగదారుడే.

ఇలాంటివి మన భారతదేశంలోనే జరుగుతాయనుకుంటే పొరపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇలానే ఉంది. బ్రెజిల్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ లో యాపిల్ వాచ్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.

బ్రెజిల్ కు   చెందిన ప్రముఖ నటుడు మురిలో బెనిసియో(50) యాపిల్  సిరీస్ 6  స్మార్ట్ వాచ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు….. (భారతీయ  కరెన్సీలో రూ. 40 వేలు) చెల్లించాడు. 12 రోజుల తర్వాత లేట్ డెలివరీతో ఆ పార్సిల్ ఆయనకు చేరింది. తీరా పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక రాయి ఉంది.
Also Read : AP PRC : పీఆర్సీ తెలంగాణ కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం-ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్
ఈ విషయమై రిటైల్ కంపెనీ కర్రెఫోర్ ను సంప్రదించాడు ఆనటుడు. కంపెనీవాళ్లు అందుకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ కంపెనీమీద బెనిసియో కోర్టులో దావా వేశాడు.

ఒక స్టార్ హీరో…పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బంది పెట్టటం సరికాదని ఆయనతరుఫున్యాయవాది కోర్టులో వాదించారు. చివరికి కోర్టులో బెనిసియా నే గెలుపొందాడు. నటుడు చెల్లించిన మొత్తం 530 డాలర్ల తోపాటు మరో 1500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ కంపెనీ అంగీకరించింది.