Hyderabad : 16 ఏళ్లకే ప్రేమలో పడ్డ అబ్బాయి..వద్దు అన్నందుకు ఆత్మహత్య..
16 ఏళ్లకే అబ్బాయి ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులకు తెలిసి ఈ వయస్సులో బుద్ధిగా చదువుకో అని చెప్పినందుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
- nagamani
- Published On : October 27, 2021 / 02:05 PM IST
16 Year Old Boy Commits Suicide
16-year-old boy commits suicide : 16 ఏళ్ల పిల్లలంటే నవ్వుతు, తుళ్లుతు తిరిగే యుక్త వయస్సు. ప్రేమంటే ఏమిటో..ఆకర్షణ అంటే ఏమిటో తెలియని అమాయకపు వయస్సు అది. మగపిల్లలైతే నూనూగు మీసాలు వచ్చే లేత వయస్సు. అటువంటి 16 ఏళ్ల వయస్సులో ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమే లోకం అన్నట్లుగా ఉన్నాడు. అది ప్రేమా కాదా? అనే క్లారిటీ కూడా లేని ఆ వయస్సది. ప్రేమ మైకంలో పడిన ఆ పిల్లాడు ఏం జరిగిందో ఏమోగానీ సడెన్ గా రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ మైకంలో పడ్డ ఆ నూనూగు మీసాల కుర్రాడు తల్లిదండ్రులకు శోకం మిగిల్చిన ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Read more : MIT Awards : యాప్ క్రియేట్ చేసిన 6th క్లాస్ పిల్లాడికి ఎంఐటీ అవార్డు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని కింగ్ కోఠిలో నివాసం ఉంటున్న ఎం.డి.అంజాద్‌ఖాన్, రజ్వీయా సుల్తానాల దంపతుల కుమారుడు 16 ఏళ్ళ ఎం.డి.అక్బర్‌ఖాన్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తన క్లాస్‌మేట్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.దీంతో చదువుపై ఇంట్రెస్టు తగ్గింది. ఎప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలే. ఈ విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియడంతో బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ వయస్సులో ప్రేమేంటీ? బుద్ధిగా చదువుకోమని మందలించారు. అయినా నూతన యవ్వనం ప్రవేశించే వయస్సులో ఆ మాటలేవీ అతని తలకు ఎక్కలేదు. ప్రేమ అనే మాట మరువలేదు. దీంతో తల్లిదండ్రులు పదే పదే మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read more : Most Expensive Fish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..పట్టుకుని అమ్మితే జైలే..
ఉదయం ఎంతకూ బయటకు రాకపోవటంతో తల్లి తలుపులు కొట్టింది. పిలిచింది. అయినా సమాధానం లేదు. దీంతో భయపడిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో రూమ్ కిటికీ డోర్ తీసి చూడగా.. ఫ్యాన్ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
