Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప..పట్టుకుని అమ్మితే జైలే..

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప మళ్లీ కనిపించింది. కానీ ఈ చేపను పట్టుకున్నా..అమ్మినా జైలుశిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అందుకే యూకేలో పట్టుకోవటానికి ఎవ్వరు సాహసించరు.

Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప..పట్టుకుని అమ్మితే జైలే..

Most Expensive Fish

Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప ‘బ్లూఫిన్ టూనా’. ఈ చేప బంగారం కంటే విలువైనదీ. ఖరీదైనదీ. అంత్యం అమూల్యమైనది కూడా. వీటి సంఖ్య అందుకే ద గ్రేట్ బ్రిటన్ ఈ చేపల్ని పట్టుకోవటంపై నిషేధం విధించింది. అయినా పట్టుకోవటానికి…వాటి అమ్మకాలు జరుగుతునే ఉంటాయి.ఈ చేప దొరికితే చాలు లక్షలు కాదు కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తారు వ్యాపారులు. భారీ బరువతో ఉండే ఈ చేపలు ఖరీదు వింటే షాక్ అవ్వాల్సిందే. వేలంలో 20 నుంచి 25 కోట్లకు కొనేస్తారు ఈ బ్లూఫిన్ టూనా చేపని.

సముద్రాల్లో ఉండే బ్లూఫిన్ టూనా(Bluefin tuna) అస‌లు దొర‌క‌నే దొర‌క‌దు. ఈ చేప‌ను చూస్తే చాలు అని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. వీటికుండే డిమాండ్ వల్ల ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతున్నాయ‌ట‌. అందుకోకొంత దీనికి అంత డిమాండ్. కోట్ల రూపాయలు వెచ్చించి కొనటానికి కూడా వెనుకాడరు అంటే దీనికుండే డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Read more : ఔరా టూనా : చేప ఖరీదు రూ.21 కోట్లు

జపాన్ లో సీ ఫుడ్ కు ఎంత గిరాకీ ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. జపనీయులు మాంస ప్రియులు. వారు ఎక్కువగా సీఫుడ్ ఇష్టంగా తింటారు. దీంతో 2019లో జ‌పాన్‌లోని టోక్యోలో 278 కిలోల బరువు ఉన్న బ్లూఫిన్ టూనా ఫిష్‌ దొరకగా..దాన్ని వేలం వేయగా..ఏకంగా 2.5 మిలియ‌న్ పౌండ్ల‌కు అమ్మేశారు. అంటే మ‌న క‌రెన్సీలో 25 కోట్ల‌కు పైనే. ఈ క్రమంలో బ్లూఫిన్ టూనా చేప తాజాగా బ్రిటన్ సముద్రంలో కనిపించింది. యూకేలోని కార్న్‌వాల్‌లో దీన్ని చూసిన ఓ వాలంటీర్ దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో మరోసారి ఈ బ్లూఫిన్ టూనా చేప వార్తల్లోకొచ్చింది.

Read more : Rarest Fish : ఈ చేప బంగారమే..కట్ చేయటం..కూర వండటం నేర్చుకోడానికి సంవత్సరాలు పడుతుందట..

జ‌పాన్‌లో ఈ చేప‌ను ప‌ట్టుకోవ‌డానికి గానీ అమ్మటానికి గానీ ఎటువంటి అడ్డంకులు లేవు.కానీ యూకేలో ఈ చేప‌ను వేటాడ‌టం, దాన్ని అమ్మటం నిషేధం. ఒక‌వేళ స‌ముద్రంలో చేప‌లు ప‌డుతుండ‌గా ఆ చేప దొరికినా కూడా దాన్ని స‌ముద్రంలో వ‌దిలేయాలి. గతంలో ఒక‌సారి ఈ చేప‌ బ్రిటీష్ ఐలాండ్‌లో ఉన్న ఐర్లాండ్ సౌత్ కోస్ట్‌లో దొర‌కింది. 270 కిలోల బ‌రువున్న ఆ చేప‌ను ఓ మ‌త్స్య‌కారుడు ప‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. దాన్ని తిరిగి స‌ముద్రంలోకి వ‌దిలేశాడు.

ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతుండ‌టంతో వాటిని కాపాడ‌టం కోసం వాటి వేట‌ను యూకేలో నిషేధించారు. ఒకవేళ ఎవరైనా దాన్ని పట్టుకుని అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. కాగా..సముద్ర చేపల్లో అత్యంత రుచిరకంగా ఉండే చేపగా టునా చేపకు ఎంతో పేరుంది. జపాన్ రాజధాని టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుకిజీ చేపల మార్కెట్లో ఏటా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున టునా చేపల వేలం కార్యక్రమం జరుగుతుంది.