Rarest Fish : ఈ చేప బంగారమే..కట్ చేయటం..కూర వండటం నేర్చుకోడానికి సంవత్సరాలు పడుతుందట..

Rarest Fish : ఈ చేప బంగారమే..కట్ చేయటం..కూర వండటం నేర్చుకోడానికి సంవత్సరాలు పడుతుందట..

Rarest Fish In Japan

Rarest Fish In Japan : జపాన్ వాసులు చేపలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సీ-ఫుడ్ అంటే ప్రాణంగా తింటారు.చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు. ఆయా చేపల్లో రుచిని బట్టి వాటి రేట్ల డిమాండ్ ఉంటుంది. వాటిలో ఉండే పోషక విలువలను బట్టి కూడా రేట్లు కూడా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పులస చేపకు ఉండే డిమాండ్ గురించి..దాని రేటు గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ పులస చేప రేటు ఎలా ఉంటుందో..దాన్ని వండే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చేయి తిరిగినవారే పులస చేపను వండగలరంటారు. పులస చేపను వండటం కూడా ఓ ఆర్ట్ అంటారు. దాని ధర..రుచి అటువంటిది మరి.

2

అలాగే జపాన్ వాసులు కూడా అరుదైనా చాలా రకాల చేపల్ని తింటుంటారు. అటువంటి చేపల్లో ఓ చేప మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఈ చేప ధరలోనే కాదు దాన్ని కట్ చేయటం..దాన్ని వండటం కూడా చాలా చాలా ప్రత్యేకమట. ఆ ప్రత్యేకమైన చేప ‘ఈల్ ఫిష్’. ఈ ఈల్ ఫిష్ ను కట్ చేయటం..దాన్ని రకరకాలుగా వండటం అంత ఈజీ కాదట. దాన్ని వండటం నేర్చుకోవటానికి సంవత్సరాలు పడుతుందట. మరీ అతిశయోక్తి అనుకోకపోతే..ఏకంగా జీవిత కాలం పడుతుందని అంటుంటారు ఈ ఈల్ ఫిష్ వంటకాలు చేసే నిపుణులు. అలాగే ఈ ఈల్ ఫిష్ ను కట్ చేయటం కూడా ఓ ఆర్ట్ అట. దాన్ని కట్ చేయటం అంత ఈజీకాదంటారు ఈ చేపను కట్ చేసే నిపుణులు. వండే షెఫ్ లు.

10

ఈ ఈల్ ఫిష్ ల‌ను మంచినీటిలో పెంచుతారు. జపాన్‌లో ఈ చేప ధర బంగారంతో సమానమట. 2018 లో ఈ చేప కిలోకు 35 వేల డాలర్ల ధరకు అమ్ముడైందంటే దీని డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా ఏళ్లు గడిచేకొద్దీ ఈ చేప రేటు పెరుగుతూనే ఉంది. జపాన్ లో ఈ చేప ధర బంగారం ధర కూడా ఇంచుమించు స‌మానంగా ఉంటుందట. జపాన్‌ వాసులు ఈ ఈల్ ఫిష్‌ని చాలా ఇష్టంగా తింటారు.

4

హోటళ్ళు, రెస్టారెంట్లలో ప్రతి సంవత్సరం సుమారు 50 టన్నుల ఈల్ చేపలు అమ్ముడవుతుంటాయి. తూర్పు ఆసియాలో లభించే ఈ చేపల పిల్లల్ని మంచినీటిలో పెంచుతారు. ఒక సంవత్సరం తరువాత, అవి అమ్మకానికి మంచి ధర పలుకుతాయి.

9

ఈ చేపలు సంఖ్య తగ్గటంతో అంతకంతకూ పెరుగుతున్న ధర
ఈ చేపలు జపాన్‌లో చాలా ఖరీదైనవిగా అమ్ముడవ్వటానికి కారణం..1980 తరువాత ఈ చేపల సంఖ్య‌ 75 శాతం తగ్గిపోయింది. ప్రజలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఈ చేప‌ల‌ను ప‌ట్టి..పెంచి అమ్ముతుంటారు. తింటుంటారు.

6

మరో కారణం ఏమిటంటే..ఈ చేపల్ని పెంచటానికి ఈల్ చేపల పిల్లలుగా ఉన్నప్పుడే పట్టుకుని పెంచాలి. వాటికి మేతగా చాలా హై ప్రొటీన్స్ ఉండే ఆహారాన్ని వేస్తారు. గోధుమలు, సోయాబీన్, చేప నూనె వంటివి ఆహారం ఇస్తారీ పిల్లలకు. అందుకే ఈ చేపల పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నది.

7

పైగా వాటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇలా పెంచే చేపల్లో ఒక చేపకు జ‌బ్బు పడితే..అది మిగిలిన చేపలకుకూడా అంటుకుంటుంది.దాంతో మిగిలిన చేపలన్నీ జబ్బుపడి చెడిపోతాయి. ఈల్ ఫిష్ పిల్లలు పెరగడానికి 6 నుండి 12 నెలల సమయం పడుతుంది. ఆ తరువాత వాటిని పొడవును బట్టి డివైడ్ చేసి ధరల్ని నిర్ణయిస్తారు.

3

ఆ తరువాత వాటిని అమ్మకానికి పెడతారు. జపాన్ లో సాధారణ ప్రజలు, హోటళ్ళు, రెస్టారెంట్లు వాటిని భారీ ధరలకు కొనుక్కుంటారు. జపాన్‌లో ఓ పండుగ సందర్భంగా ఈల్ ఫిష్ తినే సంప్రదాయం ఉంది. దీంతో ఆయా రోజుల్లో ఈ చేపల ధర రేటు ఇంకా పెరుగుతుంది. దీంతో పెంపకం దార్లకు కాసుల వర్షం కురుస్తుంది.

5

ఈల్ చేప కట్టింగ్, వంట తయారీ విధానం అంత ఈజీ కాదు..
కబయాకి అని ఈల్ ఫిష్ నుండి తయారైన వంటకం జపాన్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీనికి మంచి పేరు ఉంది. ఈ చేపతో రకరకాల డిష్ లు తయారుచేసే పద్ధతిని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అంటారు డిష్ లు వండే షెఫ్ లు. వారే కాదు సాధారణ హోటల్లో వంటలు చేసేవారు కూడా అదే అంటారు.

8

అంతేకాదు..ఈ ఈల్ చేపలను క‌ట్ చేయ‌డం కూడా చాలా కష్టం. దానిని కత్తిరించే సరైన పద్ధతిని నేర్చుకోవడానికి సంవత్సరాలు పడతాయట. దీన్ని కట్ చేయటం నేర్చుకోవటానికి ఏళ్లకు ఏళ్లు నేర్చుకుంటుంటారట. అతిశయోక్తి అనుకోకపోతే ఈ చేపను కట్ చేయటానికి లైఫ్ టైమ్ పడుతుందని చెబుతుంటారు. అంటే అంత చాకచక్యంగా ఈ చేపను కట్ చేయాలట. జపాన్ లో ఈ చేపను కట్ చేయటంలో నేర్పరితనాన్ని చూపించుకోవటానికి పోటీలే జరుగుతాయంటే ఆ స్పెషాలిటిని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో..ఈ ఈల్‌తో చేసిన గ్రిల్లింగ్ కూడా జపాన్‌లో చాలా ఖరీదైనది. దీని ధర 91 డాల‌ర్లుగా చెబుతారు.